ఫలూదా

ABN , First Publish Date - 2021-04-29T19:50:02+05:30 IST

సబ్జా గింజలు- ఆరు స్పూన్లు, ఫలూదా సేవ్‌ - 5 స్పూన్లు, రోజ్‌ సిరప్‌- ఎనిమిది స్పూన్లు, పాలు- నాలుగు కప్పులు(వేడి చేసి చల్లార్చి, ఫ్రిజ్‌లో పెట్టిననవి), వెనీలా ఐస్‌క్రీమ్‌- నాలుగు స్కూప్స్‌, బాదం, కాజు పప్పులు, చెర్రీ - చెరో పది.

ఫలూదా

కావలసిన పదార్థాలు: సబ్జా గింజలు- ఆరు స్పూన్లు, ఫలూదా సేవ్‌ - 5 స్పూన్లు, రోజ్‌ సిరప్‌- ఎనిమిది స్పూన్లు, పాలు- నాలుగు కప్పులు(వేడి చేసి చల్లార్చి, ఫ్రిజ్‌లో పెట్టిననవి), వెనీలా ఐస్‌క్రీమ్‌- నాలుగు స్కూప్స్‌, బాదం, కాజు పప్పులు, చెర్రీ - చెరో పది. 


తయారు చేసే విధానం: సబ్జా గింజల్ని నీళ్లలో అర గంట నానబెట్టి నీటిని తేసేయాలి. ఫలూదా సేవ్‌ని ఉడికించి మెత్తగా అయ్యాక నీటిని వడబట్టాలి. నట్స్‌ను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. నాలుగు పొడవాటి గాజు గ్లాసులను తీసుకోవాలి. ఒక్కో గ్లాసులో రెండు స్పూన్ల రోజ్‌ సిరప్‌, రెండు స్పూన్ల నానిన సబ్జా గింజలు, ఫలూదా సేవ్‌, ఓ కప్పు పాలని మెల్లగా పోయాలి. పైన ఓ స్పూప్‌ వెనీలా ఐస్‌క్రీమ్‌ వేసి, డ్రైఫూట్స్‌ ముక్కల్ని అందంగా అలంకరిస్తే వేసవి ఎండల్లో ఇంట్లోనే చిక్కని, చలచల్లని ఫలూదా రెడీ. అయితే తినేప్పుడు ఓ పొడవాటి స్పూనుతో కలుపుకుంటూ తింటే ఆ రుచే వేరు.


Updated Date - 2021-04-29T19:50:02+05:30 IST