చిన్నారికి పాజిటివ్‌ వచ్చిదంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం

ABN , First Publish Date - 2020-03-29T10:37:21+05:30 IST

ఓ చిన్నారికి పాజిటివ్‌ వచ్చిదంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన యువకుడిపై సైదాబాద్‌ పోలీసు లు కేసు నమోదు చేశారు.

చిన్నారికి పాజిటివ్‌ వచ్చిదంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం

యువకుడిపై కేసు నమోదు చేసిన సైదాబాద్‌ పోలీసులు


సైౖదాబాద్‌, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఓ చిన్నారికి పాజిటివ్‌ వచ్చిదంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన యువకుడిపై సైదాబాద్‌ పోలీసు లు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్‌ చేసి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నా రు. చంపాపేట ఎస్‌ఎన్‌రెడ్డినగర్‌కు చెందిన ఓ వ్యక్తి భార్య, కూతురుతో కలిసి  యూఎ్‌సఏకు వెళ్లి ఈనెల 14న నగరానికి తిరిగివచ్చారు. విమానాశ్రయంలోనే అధికారులు వీరికి స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించి  ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. 21న అతని కూతురు మూడేళ్ల చిన్నారికి జ్వరం, జలుబు రావడంతో 108కి సమాచారం ఇచ్చారు. ఇంటి వద్దకు 108 వాహనం రాగా చిన్నారిని ఫీవర్‌ ఆస్పత్రికి తరలించే దృశ్యాలు దూరం నుంచి సాయి కిరణ్‌ అనే యువకుడు రికార్డు చేశాడు.


చిన్నారికి పాజిటి వ్‌ వచ్చిదంటూ ఆస్పత్రి తరలించే వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశా డు. దీంతో వాటిని చూసిన బాధిత కుటుంబానికి చెందిన బంధువులు, తెలిసినవారు ఫోన్‌ చేస్తూ వివరాలు అడుగుతున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. తమ చిన్నారికి కరోనా వైరస్‌ సోకిదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాలని సైదాబాద్‌ పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో సాయి కిరణ్‌ను అరెస్ట్‌ చేసి అతని వద్ద సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2020-03-29T10:37:21+05:30 IST