తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు

ABN , First Publish Date - 2022-07-04T03:48:52+05:30 IST

జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, మాజీఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కాంగ్రెస్‌లో చేరు తున్నట్లు ఓ చానల్‌, దినపత్రిక తప్పుడు ప్రచారం చేసిందని, ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తె సహిం చేది లేదని జిల్లాగ్రంథాలయసంస్థ చైర్మన్‌ కనకయాద వ్‌రావ్‌, రాష్ట్ర హజ్‌కమిటీ డైరెక్టర్‌ ఇంతీయాజ్‌లాల, కెరమెరి ఎంపీపీ మోతిరాం, జడ్పీటీసీ ధ్రుపదబాయి, జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు హెచ్చరించారు.

తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు
మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

జైనూరు/కెరమెరి, జూలై 3: జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, మాజీఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కాంగ్రెస్‌లో చేరు తున్నట్లు ఓ చానల్‌, దినపత్రిక తప్పుడు ప్రచారం చేసిందని, ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తె సహిం చేది లేదని జిల్లాగ్రంథాలయసంస్థ చైర్మన్‌ కనకయాద వ్‌రావ్‌, రాష్ట్ర హజ్‌కమిటీ డైరెక్టర్‌ ఇంతీయాజ్‌లాల, కెరమెరి ఎంపీపీ మోతిరాం, జడ్పీటీసీ ధ్రుపదబాయి, జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు హెచ్చరించారు. జైనూరు, కెరమెరి మండల కేంద్రా ల్లోఆదివారం వారు వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలే కర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఎలాంటి ఆధా రాలు లేకుండా అసత్యప్రచారం చేయడం తగదన్నారు. అనంతరం స్థానిక పోలీసుస్టేషనులో ఆ పత్రికపై ఫిర్యాదు చేశారు.

తిర్యాణి: మాజీఎమ్మెల్సీ పురాణం సతీష్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌కోవలక్ష్మి పార్టీమారుతున్నట్లు ఓ టీవీచానల్‌ (ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికాదు)లో ప్రసారమైన కథనా లను వ్యతిరేకిస్తూ సదరు టీవీచానల్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం ఫిర్యాదుచేసినట్లు పేర్కొన్నారు. నాయకులు జగదీష్‌, జడ్పీటీసీ చంద్రశేఖర్‌, ఎంపీపీ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T03:48:52+05:30 IST