సమరయోధుల కుటుంబ సభ్యులకు సత్కారం

ABN , First Publish Date - 2022-08-14T05:30:00+05:30 IST

స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న మండలంలోని ఉద్యమకారుల కుటుంబ సభ్యులను ఆదివారం సత్కరించారు.

సమరయోధుల కుటుంబ సభ్యులకు సత్కారం
గంధవరపు అమర్నాథ్‌రెడ్డిను సత్కరిస్తున్న సీపీవో రాజు

 వారితో డీఆర్‌వో నారాయణమ్మ తదితరులు

సమరయోధుల కుటుంబ సభ్యులకు సత్కారం

ఇందుకూరుపేట, ఆగస్టు 14 : స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న మండలంలోని ఉద్యమకారుల కుటుంబ సభ్యులను ఆదివారం సత్కరించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలో ఐదుగురి కుటుంబ సభ్యులను గుర్తించి గౌరవించారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రాజు కొరుటూరులో గండవరపు హనుమారెడ్డి మనవడు గండవరపు అమర్‌నాథ్‌రెడ్డిని సత్కరించారు. హనుమారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధికారులు, ఎస్‌ఐ తదితర సిబ్బంది పాల్గొన్నారు. అలాగే గంగపట్నంలో బండి శేషురెడ్డి, బండి వెంకటరమణారెడ్డి, చేవూరు పిచ్చిరెడ్డి, కర్పూరపు చలమారెడ్డిలను జిల్లా అధికారులు వారి నివాసాలకు వెళ్లి సత్కరించారు.

స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ఘన సన్మానం

బుచ్చిరెడ్డిపాళెం,ఆగస్టు14 బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో పలువురు స్వాతంత్య్ర సమరయోధుల వారసులను ఆదివారం నెల్లూరు నగర కమిషనర్‌ హరిత, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ వాణి పూలమాలలు, శాలువాలతో ఘనంగా నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెంలో సమరయోధుల వారసులైన వాకాటి సుధాకర్‌రెడ్డి, పర్రి దేవదానం, పర్రి బాబు, పర్రి శ్యాంసన్‌లను వారి నివాసాలకు వెళ్లి  సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంఓ శాంతకుమారి, స్థానిక అధికారులు, 16వార్డు కౌన్సిలర్‌ బిట్రగుంట ప్రమీలమ్మ, పాల్గొన్నారు.

తోటపల్లిగూడూరు  : మండలంలోని పోట్లపూడి గ్రామ సచివాలయంలో స్వాతంత్ర్యోద్యమకారుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ముఖ్య అతిథులుగా వచ్చిన డీఆర్‌వో నారాయణమ్మ, జిల్లా సివిల్‌ సప్లయ్స్‌ అధికారి సుజాత, ఐటీడీఏ అధికారి రాణిలు పొణకా కనకమ్మ, కసుమూరు శేషారెడ్డి, మారంరెడ్డి శేషారెడ్డి, పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కసుమూరు శేషారెడ్డి మనుమడు వెంకటరమణారెడ్డి, మారంరెడ్డి శేషారెడ్డి కుటుంబీకులు అడపాల రామ్మోహన్‌రెడ్డి, పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి మనుమరాలు పొట్లపూడి సర్పంచ్‌ ప్రసూనమ్మను సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్టు వల్లూరు మాధవరావు ఆలపించిన దేశభక్తి గేయాలు సభికులను ఆకట్టుకు న్నాయి. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్యామలమ్మ, ఎంపీడీవో హేమలత, విజయ డెయిరీ మాజీ చైర్మన్‌ చిల్లకూరు సుధీర్‌రెడ్డి, మండల వైస్‌ చైర్మన్‌ చెరుకూరు శ్రీనివాసులు నాయుడు, ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది  గ్రామస్థులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-08-14T05:30:00+05:30 IST