నట్టేటా ముంచిన నకిలీ విత్తనాలు

ABN , First Publish Date - 2020-11-28T06:00:32+05:30 IST

నకిలీ విత్తనాలు యేటా పత్తి రైతులను నట్ట్టేటా ముంచుతున్నాయి. వ్యాపారులను నమ్మి విత్తనాలను కొనుగోలు చేసిన అన్న దాతలు.. తీరా కాత, పూత రాకపోవడంతో లబోదిబోమంటున్నారు.

నట్టేటా ముంచిన నకిలీ విత్తనాలు
కాత, పూత రాని పత్తి పంటను చూపుతున్న రైతులు

ఆందోళనలో పత్తి సాగు చేసిన చుచుంద్ రైతులు

భైంసా రూరల్‌, నవంబరు 27: నకిలీ విత్తనాలు యేటా పత్తి రైతులను నట్ట్టేటా  ముంచుతున్నాయి. వ్యాపారులను నమ్మి విత్తనాలను కొనుగోలు చేసిన అన్న దాతలు.. తీరా కాత, పూత రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఇలాంటి ఘట న మండలంలోని చుచుంద్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చుచుంద్‌  గ్రామానికి చెందిన సుమారు 24 మంది రైతులు ఓ ప్రైవేటు  సీడ్స్‌ వారి వద్ద 67 ప్యాకెట్ల పత్తి విత్తనాలను కొనుగోలు చేశారు. వానాకాలంలో సాగులో భా గంగా జూన్‌ 12నుంచి 19లోపు విత్తనాలను విత్తామని, నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పూత, కాత రాలేదని వాపోయారు. దీంతో రైతులందరూ విత్తనాలు అమ్మిన వ్యాపారిని ఆశ్రయించారు. వెంటనే విత్తన కంపనీ ప్రతినిధులు పంట క్షేత్రాలను సందర్శించి, సమయం ఉందని కాత వస్తుందని నమ్మబలికారు. అయినా మార్పు రాకపోవడంతో వ్యాపారులను నిలదీశారు. దీంతో పంటల వీడియోలను చిత్రీకరించి కంపనీ ఉన్నతాదికారులకు పంపించారు. ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు  కంపనీ తరుపున పరిహారం ఇస్తామని చెప్పి కనిసించకుండా పోయారు. ఫోన్‌లో సైతం అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు పత్తి పంట కాలం అయి పో వచ్చింది. చేసేదేమీ లేక, మోసపోయామని భావించిన రైతులు వ్యవసాయ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఏఈవో సౌమ్య పంట క్షేత్రాలను సం దర్శించారు. ఇప్పుడిప్పుడే  పూతవస్తున్న కాత పట్టడబం లేదని గుర్తించారు. కాగా, నివేదికను  ఉన్నతాధికారులకు అందిస్తామని  ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2020-11-28T06:00:32+05:30 IST