నకిలీ RTPCR, కొవిడ్ వ్యాక్సినేషన్ రిపోర్టుల కేసులో కొత్త కోణం

ABN , First Publish Date - 2022-01-22T16:06:29+05:30 IST

నకిలీ RTPCR, కొవిడ్ వ్యాక్సినేషన్ రిపోర్టుల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. కాసుల కోసం డయాగ్నాస్టిక్ సెంటర్లు కక్కుర్తికి పాల్పడ్డాయి.

నకిలీ RTPCR, కొవిడ్ వ్యాక్సినేషన్ రిపోర్టుల కేసులో కొత్త కోణం

హైదరాబాద్ ‌: నకిలీ RTPCR, కొవిడ్ వ్యాక్సినేషన్ రిపోర్టుల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. కాసుల కోసం డయాగ్నాస్టిక్ సెంటర్లు కక్కుర్తికి పాల్పడ్డాయి. డబ్బు కోసం నకిలీ ఆర్టీపీసీఆర్‌, కొవిడ్ వ్యాక్సినేషన్‌ రిపోర్టులను జారీ చేసినట్టు విచారణలో వెలుగు చూసింది. హోమ్‌ కేర్ డయాగ్నాస్టిక్ సెంటర్, ఇమేజ్ డయాగ్నాస్టిక్ సెంటర్‌ నకిలీ రిపోర్ట్స్ ఇచ్చాయి. కొవిడ్ నకిలీ రిపోర్ట్స్‌తో పలువురు విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. నకిలీ రిపోర్ట్స్‌తో సెలవులు పెట్టి 20 మంది విహారయాత్రలకు వెళ్లారు. శాంపిల్స్ సేకరించకుండానే పలు డయాగ్నాస్టిక్ సెంటర్స్ నెగెటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నాయి. వ్యాక్సిన్ వేయకున్నా.. వేసినట్లు తప్పుడు ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. ఇప్పటికే సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-01-22T16:06:29+05:30 IST