ఇన్‌సైడర్‌ అని అమరావతిపై విషం

ABN , First Publish Date - 2020-09-19T15:26:45+05:30 IST

అమరావతిపై విషం చిమ్మడానికి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరును పాలకులు వాడుతున్నారని రాజధాని రైతులు, మహిళలు మండిపడ్డారు. ఏకైక రాజఽ దానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండ్‌తో వారు చేస్తోన్న ఉద్యమం శుక్రవారంతో 276వ రోజుకు చేరుకుంది. పెదపరిమి, తుళ్లూరు, దొండపాడు, మందడం

ఇన్‌సైడర్‌ అని అమరావతిపై విషం

ఇష్టమై భూములు అమ్ముకున్నా తప్పేనా ?

276వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు/తాడేపల్లి(ఆంధ్రజ్యోతి): అమరావతిపై విషం చిమ్మడానికి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరును పాలకులు వాడుతున్నారని రాజధాని రైతులు, మహిళలు మండిపడ్డారు. ఏకైక రాజఽ దానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండ్‌తో వారు చేస్తోన్న ఉద్యమం శుక్రవారంతో 276వ రోజుకు చేరుకుంది. పెదపరిమి, తుళ్లూరు, దొండపాడు, మందడం, వెలగపూడి, రాయపూడి, అబ్బరాజుపాలెం, ఐన వోలు తదితర గ్రామాలలో దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఉంటుందని, ఇవి జంట నగరాలుగా అభివృద్ధి చెందు తాయని రాష్ట్ర విభజనకు ముందునుంచే అం దరూ అంచనా వేశా రన్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువ ధర చెలించి ఈ ప్రాంతాల్లో పలువురు భూములు కొనుగోలు చేశారన్నారు. ఇష్టమై భూములు అమ్ముకోవటం జరిగితే సిట్‌ పేరుతో అమరావతిని నాశనం చేయడానికి వైసీపీ నేతలు కంకణం కట్టుకున్నారన్నారు.  


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ ప్రజాభీష్టాన్ని గౌరవించాలని తాడేపల్లి మండలం పెనుమాక దీక్షలో రైతులు, రైతు కూలీలు, ఐకాస ప్రతినిధులు తెలిపారు. 276వ రోజుకు చేరుకున్న దీక్షలో కళ్లం రాజశేఖర్‌రెడ్డి, కడియం నాగరాజు, ఎర్రపీరు, ఎం సుబ్బారావు, సాబ్‌జాన్‌, సాంబిరెడ్డి పాల్గొన్నారు. 


స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయవ ద్దంటూ తాడి కొండ మండలం పొన్నెకల్లు, మోతడక  రైతులు, మహిళలు శుక్రవారం దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధానిలో అక్రమంగా భూములు కొనుగోలు చేసిన కొద్దిమందిపై తీసు కోవాల్సిన చర్యలను రాష్ట్ర ప్రజలందరిపై తీసుకో వడం ఎంతవరకు సమంజసమన్నారు. రాజధాని భూముల విష యంలో నిజాలు తేల్చాలన్నారు. మూడు రాజధానుల ప్రకటన వెన క్కు తీసుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.

Updated Date - 2020-09-19T15:26:45+05:30 IST