గర్భనిరోధక మాత్రలు - అపోహలు

ABN , First Publish Date - 2021-02-27T16:50:10+05:30 IST

గర్భనిరోధక మాత్రల విషయంలో ఎన్నో అపోహలు ఉంటాయి. మహిళలు ఈ మాత్రల ప్రభావాల గురించి తెలుసుకోవడం, అపోహలను తొలగించుకోవడం ఎంతో అవసరం.

గర్భనిరోధక మాత్రలు - అపోహలు

ఆంధ్రజ్యోతి(27-02-2021)

గర్భనిరోధక మాత్రల విషయంలో ఎన్నో అపోహలు ఉంటాయి. మహిళలు ఈ మాత్రల ప్రభావాల గురించి తెలుసుకోవడం, అపోహలను తొలగించుకోవడం ఎంతో అవసరం.


అపోహ: కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ వాడితే బరువు పెరుగుతారు.

నిజం: ఈ మాత్రల్లో ఉండే ప్రొజెస్టిన్‌ ఆకలిని పెంచుతుంది. కాబట్టి అవసరానికి మించి ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలు ఆహారశైలి మీద ఓ కన్నేసి ఉంచాలి. 


అపోహ: గర్భనిరోధకమాత్రలు వాడితే పుట్టబోయే బిడ్డలో అవలక్షణాలు తలెత్తుతాయి.

నిజం: ఇది పూర్తిగా అబద్దం. గర్భం దాల్చిన తొలినాళ్లలో పొరపాటున ఈ మాత్ర వేసుకున్నా, పుట్టబోయే బిడ్డ మీద ఎటువంటి ప్రభావం పడదు. అపోహ: దీర్ఘకాలం వాడితే గర్భధారణ సమస్యలు తలెత్తుతాయి. నిజం: ఈ మాత్రల వాడకం ఆపేసిన వెంటనే గర్భధారణ జరుగతుంది. కాబట్టి అవసరం ఉన్నంత కాలం వీటిని నిరభ్యంతరంగా వాడొచ్చు.


అపోహ: రెండు, మూడు సార్లు  ఈ మాత్రలు వేసుకోవడం మరచిపోయినా ఫర్వాలేదు

నిజం: గర్భధారణ జరిగే అవకాశాలు ఎక్కువ. నెలసరి మధ్యలో రక్తస్రావం కూడా కనిపించే వీలుంది. కాబట్టి మాత్రలు వేసుకోవడం మరచిపోతే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.  


Updated Date - 2021-02-27T16:50:10+05:30 IST