ఆంధ్రజ్యోతి పేరిట ఫేక్‌ న్యూస్‌

ABN , First Publish Date - 2021-10-24T08:32:21+05:30 IST

‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ప్రచురితమైనట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఫేక్‌ న్యూస్‌పై కరీంనగర్‌ రెండో ఠాణాలో శనివారం కేసు నమోదైంది. ‘‘హుజూరాబాద్‌లో బీజేపీ గెలవగానే అక్కడి ముస్లింలను మా చెప్పుల కింద తొక్కిపెడతాం’’

ఆంధ్రజ్యోతి పేరిట ఫేక్‌ న్యూస్‌

  • కరీంనగర్‌ టూటౌన్‌లో కేసు నమోదు


కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 23 : ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ప్రచురితమైనట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఫేక్‌ న్యూస్‌పై కరీంనగర్‌ రెండో ఠాణాలో శనివారం కేసు నమోదైంది. ‘‘హుజూరాబాద్‌లో బీజేపీ గెలవగానే అక్కడి ముస్లింలను మా చెప్పుల కింద తొక్కిపెడతాం’’ అని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ ఎంపీ అర్వింద్‌ అన్నట్లుగా గుర్తుతెలియని వ్యక్తులు ఒక తప్పుడు వార్తను సృష్టించారు. ఆ వార్త ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ప్రచురితమైనట్లుగా ఆ వ్యక్తులు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నారు. ఆంధ్య్రజ్యోతిలో ఇటువంటి కథనాన్ని ప్రచురించలేదని, ఆంధ్రజ్యోతిలో ఆ వార్త వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆంధ్రజ్యోతి కరీంనగర్‌ యూనిట్‌ ఎడిషన్‌ ఇన్‌చార్జి జయంత్‌రావు శనివారం కరీంనగర్‌ రెండో ఠాణాలో పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాల మేరకు ఐపీసీ 153, 505 (2) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ లక్ష్మీబాబు తెలిపారు.

Updated Date - 2021-10-24T08:32:21+05:30 IST