ప్రముఖ హోటల్ పేరుతో ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేసి.. సైబర్ నేరగాళ్ల ఆఫర్ల వల..

ABN , First Publish Date - 2020-05-11T16:13:18+05:30 IST

నగరంలో ఓ ప్రముఖ హోటల్‌కు సంబంధించి ఫేస్‌బుక్‌లో నకిలీ పేజీ తయారు చేసి.. ప్రత్యేక ఆఫర్‌ అంటూ ప్రచారం చేసిన వారిపై ఆ హోటల్‌ యజమాని ఫిర్యాదు చేశారు. కొవిడ్‌ కారణంగా హోటల్‌ సర్వీసులన్నీ

ప్రముఖ హోటల్ పేరుతో ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేసి.. సైబర్ నేరగాళ్ల ఆఫర్ల వల..

ప్రముఖ హోటల్‌ ఫేస్‌బుక్‌ పేజీ నకిలీది తయారు

ఒక థాలీ ఆర్డర్‌ చేస్తే మరొకటి ఫ్రీ అంటూ ప్రచారం

రూ. 10 ఆన్‌లైన్‌లో చెల్లించాలంటూ సైబర్‌ మోసగాళ్ల వసూళ్లు 


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): నగరంలో ఓ ప్రముఖ హోటల్‌కు సంబంధించి ఫేస్‌బుక్‌లో నకిలీ పేజీ తయారు చేసి.. ప్రత్యేక ఆఫర్‌ అంటూ ప్రచారం చేసిన వారిపై ఆ హోటల్‌ యజమాని ఫిర్యాదు చేశారు. కొవిడ్‌ కారణంగా హోటల్‌ సర్వీసులన్నీ తాత్కాలికంగా మూసి ఉన్నప్పటికీ.. ఫేస్‌బుక్‌లో సదరు హోటల్‌ పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ పేజీని సైబర్‌నేరగాళ్లు తయారు చేశారు. అందులో ప్రత్యేక ఆఫర్‌ అంటూ... థాలీ ఆర్డర్‌ చేస్తే రెండు ఽథాలీలు ఫ్రీ అని.. వాటిని ఇంటి వద్దకే డెలివరీ చేస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. వన్‌ ప్లస్‌ టూ ఆర్డర్‌ కన్‌ఫర్మ్‌ చేసుకోవడానికి ముందుగా రూ. 10 ఆన్‌లైన్‌లో చెల్లించాలంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. పదిరూపాయల పేరుతో మోసగాళ్లు పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ హోటల్‌ యజమాని ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసుల కేసు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2020-05-11T16:13:18+05:30 IST