Hyd: నకిలీ వైద్యుడిని అరెస్టు చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2022-07-22T17:31:57+05:30 IST

డాక్టర్‌గా చలామణి అవుతున్న నకిలీ వైద్యుడి (fake doctor)ని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

Hyd: నకిలీ వైద్యుడిని అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాదు (Hyderabad): డాక్టర్‌గా చలామణి అవుతున్న నకిలీ వైద్యుడి (fake doctor)ని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రష్యా యూనివర్సిటీ (Russia University) నకిలీ ఎంబీబీఎస్ (Fake MBBS) సర్టిఫికేట్‌తో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఎండి ఫిజీషియన్‌గా పని చేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫేక్ డాక్టర్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. నకిలీ ఎంబీబీఎస్ డాక్టర్ సర్టిఫికెట్‌తో పాటు, స్టాంపులు, కారు, బైక్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-07-22T17:31:57+05:30 IST