నకిలీ స్టాంప్‌ పేపర్ల వంచన గుట్టురట్టు

ABN , First Publish Date - 2022-03-16T17:46:39+05:30 IST

నకిలీ స్టాంప్‌ పేపర్లు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ నకిలీ సీళ్లను ఉపయోగించి తప్పుడు రికార్డులతో ఇళ్ల స్థలాలను అమ్ముతూ ప్రజలను వంచిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. నగర ఈశాన్య విభాగం పోలీసుల

నకిలీ స్టాంప్‌ పేపర్ల వంచన గుట్టురట్టు

- రూ.8 కోట్ల అక్రమాలు బహిర్గతం 

- 8 మంది అరెస్టు


 బెంగళూరు: నకిలీ స్టాంప్‌ పేపర్లు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ నకిలీ సీళ్లను ఉపయోగించి తప్పుడు రికార్డులతో ఇళ్ల స్థలాలను అమ్ముతూ ప్రజలను వంచిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. నగర ఈశాన్య విభాగం పోలీసుల కార్యాచరణలో 8 మందిని అరెస్టు చేశారు. డీసీపీ అనుప్‌ ఏ శెట్టి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ యలహంకకు చెందిన ప్రదీప్‌ అలియాస్‌ పాయ్సన్‌ ప్రదీప్‌ (28), చిక్కబొమ్మసంద్రకు చెందిన ధర్మలింగం (48), యలహంక ఉపనగర్‌కు చెందిన మంజునాథ్‌ (43), యారబ్‌ అలియాస్‌ అబ్దుల్‌ (41), వైఆర్‌ మంజునాథ్‌ (51), భద్రప్ప లే అవుట్‌కు చెందిన అబ్దుల్‌ఘని (67) శ్యాంపురకు చెందిన శబనాబాను (42), హులియూరు దుర్గకు చెందిన రామయ్య అలియాస్‌ ఆటోరామయ్య (43) అరెస్టు అయినవారిగా తెలిపారు. నిందితుల నుంచి వివిధ ముఖ విలువల 2,130 నకిలీ స్టాంప్‌ పేపర్లను, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చెందిన 17 సీళ్లు, టైప్‌రైటర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీరి నుంచి రూ.8 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు తెలుస్తోందన్నారు. సుమారు 50 ఏళ్ల క్రితం నాటి స్టాంప్‌ పేపర్‌లతో అక్రమాలకు పాల్పడినట్టు కూడా గుర్తించామన్నారు. కాగా నిందితులలో కొందరికి ఇప్పటికే నేరచరిత్ర ఉందని దర్యాప్తు సాగుతోందన్నారు. 

Updated Date - 2022-03-16T17:46:39+05:30 IST