Currency కాదు.. కాగితాలు

ABN , First Publish Date - 2021-10-27T16:41:36+05:30 IST

తక్కువ ధరకే కేజీ బంగారం విక్రయిస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో ప్రకటనను నమ్మి నగరానికి చెందిన ల్యాబ్‌ టెక్నీషియన్‌ రూ. 42 లక్షలు పోగొట్టుకున్నాడు. కాచిగూడ డీఐ యాదేందర్‌ తెలిపిన

Currency కాదు.. కాగితాలు

తక్కువ ధరకే బంగారం అంటూ రూ. 42 లక్షలు ఫట్‌

హైదరాబాద్/బర్కత్‌పుర: తక్కువ ధరకే కేజీ బంగారం విక్రయిస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో ప్రకటనను నమ్మి నగరానికి చెందిన ల్యాబ్‌ టెక్నీషియన్‌ రూ. 42 లక్షలు పోగొట్టుకున్నాడు. కాచిగూడ డీఐ యాదేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లిలో నివాసం ఉంటున్న జలీల్‌ కుమారుడు అబ్ధుల్‌ అప్రోజ్‌ (39) ల్యాబ్‌ టెక్నీషియన్‌. ముంబైకి చెందిన వికా్‌సగౌతమ్‌ కేజీ బంగారం రూ. 42 లక్షలకు విక్రయిస్తున్నట్లు రెండు రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ప్రకటన ఇచ్చాడు. ఇది చూసిన అప్రోజ్‌ బంగారం కోసం గౌతమ్‌కు ఫోన్‌ చేశాడు, హైదరాబాద్‌లో స్నేహితుడు అమీర్‌గౌతమ్‌ను కలవాలని, అత డి నెంబర్‌ ఇచ్చాడు. అప్రోజ్‌ అతనికి ఫోన్‌ చేయగా ముఖేష్‌, కిరణ్‌లను కాచిగూడ రైల్వే స్టేషన్‌ వద్దకు సోమవారం రాత్రి పంపాడు. వారు అప్రోజ్‌ను నింబోలి అడ్డాలోని మరో స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ మాటలతో మాయ చేసి అప్రోజ్‌ వద్ద రూ. 42 లక్షలతో ఉన్న బ్యాగ్‌ను తారుమారు చేశారు. బంగారం తీసుకుని వస్తామని, డబ్బుల బ్యాగు జాగ్రత్త అని నమ్మబలికించి అక్కడి నుంచి ఉడాయించారు. వారు వెళ్లిన తర్వాత బ్యాగు చూడగా డబ్బులు కనిపించలేదు. కాగితాల కట్టలు మాత్రమే ఉన్నాయి. మోసపోయానని గ్రహించిన అప్రోజ్‌ మంగళవారం కాచిగూడ పీఎ్‌సలో ఫిర్యాదు చేశాడు. సీసీ కె మెరాల ఫుటేజీ పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-10-27T16:41:36+05:30 IST