ఒంగోలులో నకిలీ కరెన్సీ కలకలం

ABN , First Publish Date - 2020-02-21T22:59:24+05:30 IST

ఒంగోలు: నగరంలో నకిలీ కరెన్సీ కలకలం రేపింది.

ఒంగోలులో నకిలీ కరెన్సీ కలకలం

ఒంగోలు: నగరంలో నకిలీ కరెన్సీ కలకలం రేపింది. కూరగాయల మార్కెట్ సెంటర్‌లో పాల డెయిరీ పాయింట్ నిర్వహిస్తున్న వ్యాపారికి చిల్లర పేరుతో ఓ వ్యక్తి టోకరా వేశాడు. ఏకంగా రూ. 31వేల నకిలీ నోట్లను అంటగట్టాడు. అందుకు ప్రతిగా రూ. వంద నోట్లను ఎత్తుకువెళ్లాడు. వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి కూరగాయల మర్కెట్ సెంటర్‌లో దొడ్ల డెయిరీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. ఆయన వద్దకు ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి.. తనవద్ద రూ. 5 వందల నోట్లు రూ. 31వేలు ఉన్నాయని, తనకు చిల్లర కావాలని అడిగాడు. సుబ్బారెడ్డి వద్ద చిల్లర ఎక్కువగా ఉండడంతో వెంటనే చిల్లర ఇచ్చి, 31వేలు తీసుకున్నాడు.


ఆ తర్వాత 5 వందల నోట్లను పరిశీలించిన సుబ్బారెడ్డి ఖంగుతిన్నాడు. అన్ని నోట్లపై ఒకే నెంబర్ ఉంది. అవి నకిలీ నోట్లుగా గుర్తించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ పూటేజీ ద్వారా నిందితుడిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు.

Updated Date - 2020-02-21T22:59:24+05:30 IST