Abn logo
Jul 1 2020 @ 03:07AM

నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్టు

విజయనగరం క్రైం, జూన్‌ 30: నకిలి కరెన్సీ ముఠా గుట్టును విజయనగరం పోలీసులు రట్టుచేశారు. వారి నుంచి రూ.31 లక్షల నకిలీ కరెన్సీతో పాటు రూ.65,350 నగదు, కలర్‌ జిరాక్స్‌ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం ఎస్పీ రాజకుమారి తెలిపిన వివరాలు... డెంకాడ మండలం అక్కివరం గ్రామానికి చెంది న కంది రాము ఇంజనీరింగ్‌ చదివాడు. యూట్యూబ్‌ ద్వారా కరెన్సీకి సంబంధించిన జిరాక్స్‌, నోట్ల కటింగ్‌ మిషన్‌ల గురించి తెలుసుకుని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. పాత పరిచయాలున్న మజ్జి రమణ, తొట్టకూటి గౌరీనాయుడు, లెంక శేఖర్‌, కర్నాన సురేష్‌, మొగిలి విజయ్‌కిరణ్‌ తోడయ్యారు. కలర్‌ జిరాక్స్‌ మిషన్ల సాయంతో రూ.31 లక్షల నకిలీ నోట్లను తయారు చేశారు. భోగాపురం మండలం సవరవల్లిలో సోమవారం జరిగే సంతలో కరెన్సీ మార్పునకు ప్రయత్నించారు. రూ.10వేల నకిలీ కరెన్సీ ఇచ్చి గొర్రెను కొనుగోలు చేశారు. ఆ నోట్లు నకిలీవని గ్రహించిన విక్రయదారుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో భోగాపురం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement