నకిలీ పత్తి విత్తన విక్రయదారుల రిమాండ్‌

ABN , First Publish Date - 2020-08-11T09:25:33+05:30 IST

నలుగురు నకిలీ పత్తి విత్తన విక్రయదారులను రిమాండ్‌ చేసినట్లు మర్రిగూడ ఎస్‌ఐ క్రాంతికుమార్‌ సోమవారం తెలిపారు.

నకిలీ పత్తి విత్తన విక్రయదారుల రిమాండ్‌

 మర్రిగూడ, ఆగస్టు 10: నలుగురు నకిలీ పత్తి విత్తన విక్రయదారులను రిమాండ్‌ చేసినట్లు మర్రిగూడ ఎస్‌ఐ క్రాంతికుమార్‌ సోమవారం తెలిపారు. నయగ్రా కంపెనీకి చెందిన యజమాని నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు తయారుచేసి మర్రిగూడలో కొంతమంది ఫర్టిలైజర్‌, సీడ్స్‌ షాపుల యజమానులకు విక్రయించాడు. ఆ నలుగురు యజమానులు ఆ విత్తనాలను రైతులకు అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు, వ్యవసాయ అధికారులు ఫర్టిలైజర్‌, సీడ్స్‌ దుకాణాలపై ఈ నెల 7న దాడులు నిర్వహించారు.


మర్రిగూడకు చెందిన బోయపల్లి మల్లేష్‌, లెంకలపల్లికి చెందిన కర్నాటి నాగరాజు, ఐతేగోని శ్రీకాంత్‌, శివన్నగూడ గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ల వద్ద నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంపై విచారణ నిర్వహించి సోమవారం ఆ నలుగురిని అరెస్ట్‌ చేసి దేవరకొండ కోర్టుకు రిమాండ్‌ చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2020-08-11T09:25:33+05:30 IST