ఫేక్‌ చెక్‌ల గుట్టు రట్టు!

ABN , First Publish Date - 2020-09-23T10:14:25+05:30 IST

నకిలీ చెక్కులతో ప్రభుత్వానికి రూ.117 కోట్లు కుచ్చుటోపీ పెట్టేందుకు యత్నించిన ముఠా ఆనవాళ్లు సీఎం సొం త జిల్లాలో వెలుగు చూశాయి. కోల్‌కతా, ఢిల్లీ, మంగళూరు బ్యాంకుల్లో మూడు చెక్కులు

ఫేక్‌ చెక్‌ల గుట్టు రట్టు!

‘సీఎంఆర్‌ఎఫ్‌’ సూత్రధారి కడప జిల్లావాసి 

అధికార పార్టీ చోటా నాయకుడిగా గుర్తింపు 

పోలీసుల అదుపులో భాస్కరరెడ్డి


అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): నకిలీ చెక్కులతో ప్రభుత్వానికి రూ.117 కోట్లు కుచ్చుటోపీ పెట్టేందుకు యత్నించిన ముఠా ఆనవాళ్లు సీఎం సొం త జిల్లాలో వెలుగు చూశాయి. కోల్‌కతా, ఢిల్లీ, మంగళూరు బ్యాంకుల్లో మూడు చెక్కులు డిపాజిట్‌ చేసిన ముఠా కోసం సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. అసలు సూత్రధారి ప్రొద్దుటూరుకు చెందిన అధికార పార్టీ చోటా నేతగా తేలడంతో హుటాహుటిన వెళ్లి అ దుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఆయన్ను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. ప్రొ ద్దుటూరుకు చెందిన భాస్కరరెడ్డి 3 చెక్కులు ఫోర్జరీ చేసి రూ.లక్షలు డ్రా చేసినట్లు సీఐడీ అధికారులు గు ర్తించారు. ఈ వ్యవహారంలో భాస్కరరెడ్డిపై ప్రశ్నల వ ర్షం కురిపించిన అధికారులు సీఎంఆర్‌ఎ్‌ఫలో ఇప్పటి కే భారీగా దోపిడీ జరిగినట్లు అనుమానిస్తున్నారు. 

 

దోపిడీ ఇలా: విశ్వసనీయ సమాచారం మేరకు... సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి తక్కువ మొత్తం ఇప్పించాలని కోరుతూ ప్రజా ప్రతినిధుల వద్దకు బాధితుల వివరా లు, ఆస్పత్రి బిల్లులతో ఈ ముఠా వస్తుంది. ఎమ్మెల్యే లు ఇచ్చే సిఫారసు లేఖలతో రూ.25-30 వేలు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి సాయం చేస్తున్నారు. ఆ చెక్కులను మా యంచేసి వాటి స్థానంలో రూ.లక్షలు రాసుకుని బ్యాం కుల్లో డిపాజిట్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేది ఒకరి పేరుతో అయితే ఈ ముఠా మరొకరి పేరుతో కొత్త చె క్కు పెద్దమొత్తంలో రాసి డిపాజిట్‌ చేస్తోంది. తాజాగా పట్టుబడిన భాస్కరరెడ్డి కూడా ఆర్నెల్ల క్రితం ముగ్గు రు లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం వారికి ఇచ్చిన రూ.25వేల లోపు ఉన్న చెక్కులను తీసుకున్నాడు. బ్యా ంకు నుంచి డబ్బు తెచ్చిస్తానంటూ వాటిని తీసుకెళ్లి అందులో ఉన్నంత తెచ్చి వారికిచ్చాడు. తర్వాత అదే నంబరుతో నకిలీ చెక్కులు తయారు చేయించి రూ.10 లక్షల వరకూ విత్‌డ్రా చేశాడు.

Updated Date - 2020-09-23T10:14:25+05:30 IST