పెళ్లయి ఎంత కాలమైనా సంతానం కలగకపోతే ఆ దంపతుల బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి దంపతులను మోసం చేస్తూ.. సదరు భార్యల మీద అత్యాచారాలకు పాల్పడుతున్న ఒక దొంగ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బిహార్లోని మాధేపురాలో వెలుగు చూసింది.
కైలాష్ పాసవాన్ ఉరఫ్ చిల్కా బాబా అనే వ్యక్తి భాగీపురా గ్రామంలో ఉండేవాడు. సంతానం లేని దంపతులకు మందు ఇస్తానని, తద్వారా వాళ్లకు సంతానం కలుగుతుందని అతను చెప్పేవాడు. ఆ మాటలు నమ్మి వచ్చే దంపతులకు మత్తు మందు ఇచ్చేవాడు. స్పృహ తప్పిన మహిళలపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా దాదాపు 9 నెలలపాటు తనను బలాత్కరించాడంటూ ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు.
సదరు దొంగ బాబాను అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఇప్పటి వరకు చాలామంది యువతులను ఇలాగే అత్యాచారం చేశాడు. పోలీసులకు సదరు బాబా ఇంట్లో చాలా మంది దంపతుల ఫొటోలు లభించాయి. ఈ దొంగ బాబా ఒక్కడే ఈ వ్యవహారం నడిపాడా? లేక అతనికి ఇంకెవరైనా సహకారం అందించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి