హైదరాబాద్‌లో నకిలీ బాబా లీలలు..

ABN , First Publish Date - 2021-09-06T21:31:38+05:30 IST

హైదరాబాద్: నగరంలో మరో నకిలీ బాబా మోసం బట్టబయలైంది.

హైదరాబాద్‌లో నకిలీ బాబా లీలలు..

హైదరాబాద్: నగరంలో మరో నకిలీ బాబా మోసం బట్టబయలైంది. ఓ నకిలీ బాబా ఎంబీబీఎస్ యువతికి వల వేశాడు. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్ష పాస్ చేయిస్తానని మాయమాటలు చెప్పాడు. విశ్వజిత్ జా అనే నకిలీ బాబా ఇప్పటి వరకు విడతల వారీగా రూ. 80 వేలు తన ఎకౌంట్‌లో జమ చేయించుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే సంప్రదించేందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బాబా స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువతి గడ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న నకిలీ బాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2021-09-06T21:31:38+05:30 IST