మీ మీడియాను కట్టడి చేయండి.. భారత్‌కు నేపాల్ లేఖ

ABN , First Publish Date - 2020-07-13T14:43:02+05:30 IST

నేపాల్‌కు వ్యతిరేకంగా భారత మీడియాలో వస్తున్న వార్తల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ నేపాల్ ప్రభుత్వం భారత్‌కు ఓ నోట్ పంపింది.

మీ మీడియాను కట్టడి చేయండి.. భారత్‌కు నేపాల్ లేఖ

ఖాట్మండూ: నేపాల్‌కు వ్యతిరేకంగా భారత మీడియాలో వస్తున్న వార్తల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ నేపాల్ ప్రభుత్వం భారత్‌కు ఓ నోట్ పంపింది. ఈ కథనాలు నేపాలీల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటున్నాయని ఆరోపించింది. ఇటువంటి తప్పుడు వార్తల వల్ల ఇరు దేశాల దౌత్య సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొంది. నేపాల్‌లో దూరదర్శన్ మినహా ఇతర ఛానళ్ల ప్రసారాలను అక్కడి కేబుల్ ఆపరేటర్లు నిలిపివేసిన కొద్ది రోజులకే నేపాల్ ఈ విధంగా స్పందించింది. భారత్ మీడియాలో నేపాల్‌పై వస్తున్న కథనాలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని ప్రభుత్వం ఆ నోట్‌లో పేర్కొంది. నేపాల్‌పై బురదచల్లేందుకు ఉద్దేశించిన ఈ వార్తలు నేపాలీల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, నేపాలీ రాజకీయ నేతలకు అపఖ్యాతీ తెస్తున్నాయని ఆరోపించింది. కాబట్టి.. ఇటువంటి కథనాలు కట్టడి చేయాలని భారత్ ప్రభుత్వాన్ని కోరింది. కాగా.. చానళ్ల నిలిపివేతపై భారత్ మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. 

Updated Date - 2020-07-13T14:43:02+05:30 IST