రైతులకు న్యాయమైన పరిహారం

ABN , First Publish Date - 2022-09-28T05:55:33+05:30 IST

నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందించి ఆదుకుంటామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

రైతులకు న్యాయమైన పరిహారం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి 

  గట్టు, సెప్టెంబరు 27 : నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందించి ఆదుకుంటామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. పరిహారంపై స్పష్టత ఇవ్వక పోవడంతో నిర్వాసిత రైతులు ఇటీవల పనులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో భూములు కోల్పోతున్న కుచినెర్ల, మల్లాపురం తండా, రాయపురం గ్రామాల రైతులతో మంగళవారం మల్లాపురం తండా సమీపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎత్తిపోతల పనులను అడ్డుకోవడం సరికాదన్నారు. తనపై నమ్మకం ఉంచాలని, సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రెండు, మూడు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధిపై అసత్యాలు మాట్లాడుతూ రెచ్చగొట్టే వారి మాటలను నమ్మొద్దని సూచించారు. ఆర్డీవో రాములు మాట్లాడుతూ రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ రైతుకు పరిహరం అందేలా చూస్తామని చెప్పారు. ఎవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ శాఖ ఈఈ రైముద్దిన్‌, ఎంపీపీ విజయ్‌, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, వైస్‌ ఎంపీపీ రామకృష్ణనాయుడు, సుదర్శన్‌ రెడ్డి. సర్పంచ్‌ల సంఘం అద్యక్షుడు హనుమంతునాయుడు, టీఅర్‌ఎస్‌పార్టీ అద్యక్షులు రామకృష్ణరెడ్డి, ఉరుకుందు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.


బస్తీ దవాఖానాలతో సత్వర వైద్య సేవలు

గద్వాల టౌన్‌ : పేదలకు సత్వర వైద్య సేవలందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. పట్టణంలోని 24వ వార్డులో నిర్మిస్తున్న బస్తీ దవాఖానా పనులను మంగళవారం మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌తో కలిసి పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు శ్రీనుముదిరాజ్‌, మురళి, నరహరిగౌడ్‌, నాగరాజు, మహేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-28T05:55:33+05:30 IST