అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-04-17T03:49:41+05:30 IST

గృహాల్లో జరిగే అగ్నిప్రమాదాలు, వాటి నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని స్థానిక అగ్నిమాపక కేంద్రం అధికారి డీవీ రమణయ్య పేర్కొన్నారు.

అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం
సిలిండర్‌ మంటలను ఆపేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

కావలి, ఏప్రిల్‌ 16: గృహాల్లో జరిగే అగ్నిప్రమాదాలు, వాటి నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని స్థానిక అగ్నిమాపక కేంద్రం అధికారి డీవీ రమణయ్య పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక కోఆపరేటీవ్‌ కాలనీలోని శివప్రియ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదాలు వాటి నివారణపై అగ్నిమాపక సిబ్బంది మాక్‌డ్రిల్‌ కార్యక్రమం చేపట్టారు. ఆ శాఖ అధికారి డీవీ రమణయ్య ఆధ్వర్యంలో ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌లోని మహిళలకు గ్యాస్‌ సిలిండర్లు, ఎలక్ట్రికల్‌ పరికరాలు అగ్నిప్రమాదాలకు గురైనపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. వంట పూర్తి అయిన ప్రతిసారి రెగ్యులేటర్‌ను ఆపివేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపార్ట్‌మెంట్‌ చైర్మన్‌ పార్థసారది రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది ఎస్‌. వెంకటేశ్వర్లు, సుధాకర్‌, షేక్‌. గౌష్‌బాష, ఈ. రామకృష్ణ, ఎం. నరసింహం, పీ. వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T03:49:41+05:30 IST