హాజరుకాకపోతే సభను అగౌరవపర్చినట్లే!

ABN , First Publish Date - 2021-07-27T04:46:36+05:30 IST

హాజరుకాకపోతే సభను అగౌరవపర్చినట్లే!

హాజరుకాకపోతే సభను అగౌరవపర్చినట్లే!
నేలపై కూర్చొని నిరసన తెలుపుతున్న సర్పంచ్‌ నర్సింహారెడ్డి

  • మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి 


శంకర్‌పల్లి: మూడు నెలలకోసారి జరిగే మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు హాజరుకాకపోవడం సభను అగౌరపరిచినట్లేనని ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండల పరిషత్‌లో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. పది మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీలు, పలువురు అధికారులు హాజరుకాలేదు. దీంతో ఎంపీపీ అశక్తత వ్యక్తం చేశారు. ప్రొద్దుటూర్‌ సర్పంచ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిధులు రాక దాతల సహకారంతో గ్రామంలో పనులు చేస్తోంటే అధికారులు కక్ష సాధింపుతో దాతల స్థిరాస్తులను ధ్వంసం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. మాసానిగూడ సర్పంచ్‌ రాములు మాట్లాడుతూ ఆరు నెలల నుంచి మిషన్‌ భగీరథ నీరు రావడం లేదన్నారు. బుల్కపురం నుంచి జన్వాడ వరకు ఫిరంగి నాలా కబ్జా చేసనా అధికారులు పట్టించుకోవడం లేదని  సర్పంచులు శ్రీనివాస్‌, నర్సింహారెడ్డి తెలిపారు. విద్యుత్‌ తీగలు ప్రమాదకరంగా వేలాడున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గాజులగూడ సర్పంచ్‌ శ్రీనివా్‌సరెడ్డి, కొండకల్‌ ఎంపీటీసీ సురేందర్‌రెడ్డి తెలిపారు. కొత్తపల్లిలో ఎం.భూపాల్‌ అనే వ్యక్తి 162సర్వే నెంబర్‌లో 10గుంటల భూమిని కబ్జా చేశాడని అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఎంపీటీసీ శోభ అన్నారు. దొంతన్‌పల్లి-పొన్నగుట్ట తండా 33ఫీట్ల రోడ్డు ఇక్ఫాయ్‌ కాలేజీ యాజమాన్యం కబ్జా చేసినా అధికారులు చర్యలు తీసుకోవడంలేదని ఇరుక్కుంట తండా సర్పంచ్‌ సంతోషిశంకర్‌నాయక్‌ తెలిపారు. జట్పీటీసీ గోవిందమ్మగోపాల్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ రాములమ్మ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బుచ్చిరెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, ఎంఈవో సయ్యద్‌అక్బర్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:46:36+05:30 IST