Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 08 Aug 2022 15:32:04 IST

Malayankunju: ఓటీటీలోకి ఫహాద్ ఫాసిల్ కొత్త సినిమా.. ఎప్పుడంటే..

twitter-iconwatsapp-iconfb-icon

‘పుష్ప’ సినిమాతో తెలుగులోనూ గుర్తింపు పొందిన మలయాళీ నటుడు ఫహాద్ ఫాసిల్ Fahadh Faasil). ఈ మూవీతో ఈ నటుడికి దేశవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. అంతేకాకుండా.. ఇటీవలే విడుదలై మరో పాన్ ఇండియా మూవీ ‘విక్రమ్’‌తోనూ తనదైన గుర్తింపు సాధించాడు. ఈ మలయాళీ నటుడు ఓ వైపు ఇతర భాషల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తూనే మలయాళంలో హీరోగా కొనసాగుతున్నాడు. ఈ మల్లు యాక్టర్ తాజాగా నటించిన చిత్రం ‘మలయంకుంజు (Malayankunju)’. జులై 22న థియేటర్స్‌లో విడుదలైన ఈ మలయాళ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.


ఈ మూవీ ఓటీటీ విడుదలకి రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) ఓ ట్రైలర్‌ని విడుదల చేసింది. ఈ మూవీ అమెజాన్‌లో ఆగస్టు 11న విడుదలై.. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లోని ప్రేక్షకులని అందుబాటులోకి రానున్నట్లు అందులో చెప్పకొచ్చింది. సాజిమోన్ ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రజీషా విజయన్ హీరోయిన్‌గా నటించింది. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి ఊరి మీద పడతాయి. దీంతో మలయకుంజు అనే వ్యక్తి కొండ చరియల అడుగున్న ఇరుక్కుంటాడు. దానికి వల్ల అతను ఎదుర్కొన్న పరిస్థితుల సమాహారమే ఈ చిత్రం. ‘విక్రమ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఫహాద్ నటించిన తొలి భారీ చిత్రం ‘మలయకుంజు’. ఈ మూవీ గురించి ఫహాద్ మాట్లాడుతూ.. ‘నేను నటించిన చిత్రాల్లో ఈ సినిమానే చాలా కష్టమైంది. సినిమాలో సెకండాఫ్ కోసం దాదాపు 40 అడుగుల లోతులో సెట్ వేశారు. అక్కడ షూటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement