టెన్త్‌ స్పాట్‌ కేంద్రాల వద్ద ఫ్యాప్టో నిరసనలు

ABN , First Publish Date - 2022-05-18T06:23:11+05:30 IST

ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఒంగోలులోని పదో తరగతి మూల్యాంకన కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

టెన్త్‌ స్పాట్‌ కేంద్రాల వద్ద ఫ్యాప్టో నిరసనలు
స్పాట్‌ కేంద్రమైన ఒంగోలు డీఆర్‌ఆర్‌ఎం స్కూల్‌ వద్ద నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

 ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు 

ఒంగోలు(విద్య), మే 17: ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఒంగోలులోని పదో తరగతి మూల్యాంకన కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలు, రామనగర్‌  హైస్కూలు ప్రధాన ద్వారాల వద్ద ఉదయం 8.30కు చేరుకున్న ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిఽథిగా పాల్గొన్న బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.మోహనరావు మాట్లాడుతూ సీపీఎస్‌ను వెంటనే రద్దుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వాకా జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ నూతన విద్యా విధానం అమలును నిలిపివేయాలని కోరారు. దీంతో విద్యార్థుల డ్రాప్‌ అవుట్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వీరారెడ్డి మాట్లా డుతూ పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాల మేరకు ప్రభుత్వం వెంటనే జీవోలను విడుదల చేయాలన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ టెన్త్‌ మూల్యాంకనం రేట్లను పెంచాలని కోరారు. ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు కె.వి.జి.కీర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల సంబంధించిన షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీసీఎఫ్‌ఈఏ రాష్ట్ర నాయకుడు బాజీఖాన్‌, నాయకులు సువర్ణబాబు, ఉమామహేశ్వరి, వెంకటేశ్వర్లు, పి.వెంకట్రావు, డి.శ్రీనివాసులు, బి.శేషారావు, పి. హనుమంతరావు, షేక్‌ ఖాదర్‌బాష, ఎం.యోహన్‌రెడ్డి, విజయసారథి, బి.వెంకటేశ్వర్లు, సీహెచ్‌ రఘు, పీఎం.ఖాన్‌, టి.రమేష్‌బాబు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-18T06:23:11+05:30 IST