శ్రీ శ్రీ రవిశంకర్ ప్రతి సంవత్సరం ఎన్నిదేశాలు తిరుగుతారో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-05-14T17:43:42+05:30 IST

మొన్న మే 13న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు...

శ్రీ శ్రీ రవిశంకర్ ప్రతి సంవత్సరం ఎన్నిదేశాలు తిరుగుతారో తెలిస్తే..

మొన్న మే 13న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ తన 66వ పుట్టినరోజు జరుపుకున్నారు. శ్రీశ్రీ 1956లో దక్షిణ భారతదేశంలో జన్మించారు. నాలుగేళ్ల వయసులో రవిశంకర్ భగవద్గీత చదవడం ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి ధ్యానం పట్ల ఆసక్తి ఉండేది. వేద సాహిత్యం, భౌతిక శాస్త్ర విషయాలను అభ్యసించాడు. 1982లో కర్ణాటకలోని షిమోగాలో శ్రీశ్రీ పదిరోజుల పాటు మౌనం పాటించారు. దీని తరువాత సుదర్శన క్రియ పుట్టింది. సుదర్శన క్రియ అనేది చాలా ప్రజాదరణ పొందిన జీవన కళ. ఇది ఒక శ్వాస ప్రక్రియ. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా లక్షల మందికి గల మానసిక వేదనను శ్రీశ్రీ తొలగించారు. శ్రీశ్రీ ఏటా దాదాపు 40 దేశాలలో పర్యటిస్తూ, ఏడాదిలో దాదాపు 180 రోజుల పాటు యాత్రలో ఉంటారు. శ్రీశ్రీ భారతదేశంతో పాటు ఇతర దేశాలలో కూడా శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తుంటారు. వారికి ఏడు భాషలు తెలుసు. శ్రీశ్రీ శాస్త్రీయ సంగీతంలో కూడా నిపుణుడు. వీణ వాయించడంలో నిష్ణాతుడు. అమెరికన్, కెనడియన్ నగరాల లీగ్‌లో, డెట్రాయిట్ మేయర్ జూలై 7ని శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవంగా ప్రకటించారు. ఈ ప్రదేశాలలో ప్రతి సంవత్సరం జూలై 7న శ్రీ శ్రీ రవిశంకర్ దివస్ జరుపుకుంటారు. 



శ్రీశ్రీ నవంబర్ 2017లో బెంగుళూరులో ఘమ్-ఎ-మొహబ్బత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 కశ్మీరీ కుటుంబాలు పాల్గొన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఉల్ఫా వంటి సంస్థలకు చెందిన దాదాపు 700 మంది మాజీ తీవ్రవాదులు బెంగళూరులోని ఆశ్రమానికి వచ్చారు, వీరికి దాదాపు ఒక నెల పాటు వృత్తి నైపుణ్యాలలో శిక్షణ అందించారు తద్వారా ఈ మాజీ ఉగ్రవాదులకు పునరావాసం కల్పించారు.  శ్రీశ్రీ. ఇప్పటికి మూడుసార్లు ఇరాక్‌ని సందర్శించారు.దేశవ్యాప్తంగా ఎండిపోయిన 49 నదుల పునరుద్ధరణకు శ్రీశ్రీ కృషి చేస్తున్నారు. ఈ పనుల వల్ల 12,077 గ్రామాలవారు మంది లబ్ధి పొందుేతున్నారు. శ్రీశ్రీ 65 దేశాలలో 8 లక్షల మందికి పైగా ఖైదీల పునరావాస శిబిరాలకు హాజరయ్యారు. శ్రీశ్రీ తన సంస్థల ద్వారా 22 రాష్ట్రాల్లో జీరో కాస్ట్ ఫార్మింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. దీని వల్ల దాదాపు 22 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.


Read more