ఫేక్‌ న్యూస్‌కు ఫేస్‌బుక్‌ అడ్డుకట్ట

ABN , First Publish Date - 2021-05-29T08:40:38+05:30 IST

తప్పుడు వార్తలు లేదా సమాచారాన్ని పేస్‌బుక్‌లో ఉంచేవాళ్ల సంఖ్య పెరిగిపోయింది. వీటిని అడ్డుకునేందుకు మరిన్ని గట్టి చర్యలు చేపడుతున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

ఫేక్‌ న్యూస్‌కు ఫేస్‌బుక్‌ అడ్డుకట్ట

తప్పుడు వార్తలు లేదా సమాచారాన్ని పేస్‌బుక్‌లో ఉంచేవాళ్ల సంఖ్య పెరిగిపోయింది. వీటిని అడ్డుకునేందుకు మరిన్ని గట్టి చర్యలు చేపడుతున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. కొవిడ్‌ 19, వ్యాక్సిన్లు, ఎన్నికల సమాచారం నుంచి చాలా విషయాలకు సంబంధించి ఫేక్‌ న్యూస్‌ ఫేస్‌బుక్‌లో ప్రచారంలోకి వస్తూ ఉంటుంది. అదేపనిగా తప్పుడు సమాచారాన్ని పెడుతున్న వ్యక్తులపై కన్నేయాలని భావిస్తోంది.


ఫ్యాక్ట్‌ చెకింగ్‌ భాగస్వాములతో కలిసి ముందు వారిని కనుగొంటుంది. తరచూ అటువంటి పనులకు పాల్పడుతున్న వ్యక్తులకు నోటీసు ఇస్తుంది. అలాగే వారు పెట్టే పోస్టులు చాలా దిగువకు అంటే ఎఫ్‌బి తెరవగానే పైనే కనిపించకుండా చూస్తుంది. మరింత లోతుగా బ్రౌజ్‌ చేస్తే తప్ప కన్పించని విధంగా చర్యలు తీసుకుంటుంది. ఫేక్‌ న్యూస్‌ సమాచారం చుట్టూ రీడిజైనింగ్‌ ద్వారా వాటిని సులువుగా కనిపెట్టేలా చేస్తుంది. అలా వినియోగదారులకు అది ఫేక్‌ న్యూస్‌ అని ఇట్టే తెలిసేలా ఏర్పాటు చేస్తుంది. వాటిని షేర్‌ చేయకూడదనే విషయాన్ని స్పష్టపరుస్తుంది. మొత్తమ్మీద ఫేక్‌ న్యూస్‌తో అభాసుపాలు కాకుండా ఉండేందుకు సమాయత్తమవుతోంది. 

Updated Date - 2021-05-29T08:40:38+05:30 IST