Facebook: ఎవరో తప్పుడు configuration చేశారు

ABN , First Publish Date - 2021-10-05T20:48:35+05:30 IST

వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ వంటి మెసేజింగ్ సర్వీసులు

Facebook: ఎవరో తప్పుడు configuration చేశారు

వాషింగ్టన్ : వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ వంటి మెసేజింగ్ సర్వీసులు, సామాజిక మాధ్యమాలకు సోమవారం కలిగిన అంతరాయానికి కారణం ‘ఫాల్టీ కన్షిగరేషన్ ఛేంజ్’ అని ఫేస్‌బుక్ ఇంక్ ప్రకటించింది. కన్ఫిగరేషన్‌లో మార్పు వల్ల సోమవారం దాదాపు ఆరు గంటలపాటు సుమారు 3.5 బిలియన్ల మంది యూజర్లు ఈ సేవలను వినియోగించుకోలేకపోయారు. 


ఫేస్‌బుక్ ఇంక్ సోమవారం రాత్రి ఓ బ్లాగ్ పోస్ట్‌లో ఈ ఆరోపణ చేసింది. అయితే ఈ మార్పు ఎవరు చేశారు? ఇది ముందుగా ప్రణాళిక తయారు చేసుకుని అమలు చేసినదా? అనే విషయాలను తెలియజేయలేదు. 


ఇదిలావుండగా, ఓ వార్తా సంస్థతో కొందరు ఫేస్‌బుక్ ఉద్యోగులు మాట్లాడుతూ, ఈ అంతరాయానికి కారణం ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను సిస్టమ్స్‌కు బదిలీ చేయడంలో జరిగిన ఇంటర్నల్ మిస్టేక్ అని చెప్పారు. ఇంటర్నల్ కమ్యూనికేషన్ టూల్స్ వైఫల్యం, అదే నెట్‌వర్క్‌పై ఆధారపడిన ఇతర వనరుల వైఫల్యం వల్ల ఈ పొరపాటు జరిగినట్లు తెలిపారు. సెక్యూరిటీ నిపుణులు చెప్తున్నదాని ప్రకారం, ఈ కంపెనీలోని వ్యక్తుల వల్ల అనుకోకుండా పొరపాటు జరిగి ఉండవచ్చు, లేదా, ఉద్దేశపూర్వక ద్రోహం జరిగి ఉండవచ్చు. 


ఫేస్‌బుక్ లాభార్జనకే ప్రాధాన్యమిస్తోందని, విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారాలను అరికట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఓ విజిల్ బ్లోయర్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-10-05T20:48:35+05:30 IST