Facebook గందరగోళానికి కొన్ని గంటల ముందు ఈ whistleblower సంచలనం

ABN , First Publish Date - 2021-10-06T00:33:40+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ సేవలు దాదాపు ఏడుగంటలపాటు నిలిచిపోవడానికి ముందు ఆ

Facebook గందరగోళానికి కొన్ని గంటల ముందు ఈ whistleblower సంచలనం

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ సేవలు దాదాపు ఏడుగంటలపాటు నిలిచిపోవడానికి ముందు ఆ సంస్థ మాజీ ఉద్యోగి, విజిల్ బ్లోయర్ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. ఫేస్‌బుక్‌లో జరుగుతున్న తప్పులను ఆమె ఎత్తిచూపుతూ తన వివరాలను బయటపెట్టారు. ఆమె పేరు ఫ్రాన్సెస్ హాగెన్ (37). వివరాలను బయటపెట్టడానికి ముందు ఆమె ప్రభుత్వ రక్షణ కోరారు. 


ప్రభుత్వానికి, సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ కమిషన్, వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు చేరిన అంతర్గత డాక్యుమెంట్లను హాగెన్ బయటపెట్టారు. అల్గారిథమ్‌ను మారిస్తే ఫేస్‌బుక్ మరింత సురక్షితంగా ఉంటుందని, అయితే అలా చేస్తే ఫేస్‌బుక్‌లో జనాలు ఎక్కువ సేపు ఉండరని, ప్రకటనపై తక్కువ క్లిక్‌లే వస్తాయన్న విషయం ఫేస్‌బుక్‌కు తెలుసని అన్నారు. అందుకనే ఫేస్‌బుక్ తన రక్షణను పటిష్టం చేసుకోవడం లేదని ఆరోపించారు. తాను చాలా సోషల్ నెట్‌వర్కులను చూశానని, వాటి ముందు ఫేస్‌బుక్ ఎందుకూ కొరగాదని పేర్కొన్నారు. ఫేస్‌బుక్ మళ్లీమళ్లీ సేఫ్టీ కంటే ఆదాయాన్నే కోరుకుంటోందని హాగెన్ ఆరోపించారు. 


హాగెన్ లైవ్ ముగిసిన కాసేపటికే ఫేస్‌బుక్, దాని అనుబంధ కంపెనీలైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ దాదాపు ఏడు గంటలపాటు నిలిచిపోవడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు అల్లాడిపోయారు. దాదాపు ఏడు గంటల తర్వాత ఫేస్‌బుక్ తన సేవలను పునరుద్ధరించింది. కన్ఫిగరేషన్ మార్పులు తప్పుదొర్లడం వల్లే ఇలా జరిగిందని ఫేస్‌బుక్ వివరణ ఇచ్చింది.  

Updated Date - 2021-10-06T00:33:40+05:30 IST