పేరు మార్చుకున్న ఫేస్‌బుక్

ABN , First Publish Date - 2021-10-29T15:12:34+05:30 IST

దశాబ్ద కాలంగా సోషల్ మీడియా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైంది. ప్రపంచంలోని మెజారిటీ ప్రజలు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి..

పేరు మార్చుకున్న ఫేస్‌బుక్

కాలిఫోర్నియా: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పేరు మారింది. ఇక నుంచి ఫేస్‌బుక్ ప్లాట్‌ఫాంను ‘మెటా’గా గుర్తించనున్నట్లు ఫేస్‌బుక్ యాజమాన్యం నిర్ణయించినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపింది. ఫేస్‌బుక్ యాజమాన్యం పరిధిలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికలు ఉన్నాయి. అయితే గూగుల్ తరహాలో వీటన్నిటికీ ఒక మాతృ సంస్థ ఉండాలని ఫేస్‌బుక్ భావించింది. అందుకే ఫేస్‌బుక్ అనే పేరును మాతృ సంస్థగా ఉంచి, ఇప్పుడున్న ఫేస్‌బుక్ ప్లాట్‌ఫాంకు కొత్త పేరును పెట్టాలని జూకర్‌బర్గ్ నిర్ణయించారు.


గూగుల్ సంస్థలకు అల్ఫాబెట్ ఇంక్ అనే మాతృ సంస్థ ఉంది. ఈ మాతృ సంస్థ పరిధిలోనే గూగుల్‌కు సంబంధించిన అన్ని సంస్థలు పని చేస్తాయి. ఇక నుంచి మెటా, వాట్సాప్, ఇన్‌గ్రామ్‌లకు కూడా ఫేస్‌బుక్ మాతృ సంస్థలా ఉండనుంది. అయితే గూగుల్‌లా కొత్త పేరుతో కాకుండా పాపులర్‌గా ఉన్న ఫేస్‌బుక్ పేరునే మాతృ సంస్థ పేరుగా ఉంచి, ఇప్పుడున్న ఫేస్‌బుక్ వేదికకు కొత్త పేరును ఖరారు చేశారు.


దశాబ్ద కాలంగా సోషల్ మీడియా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైంది. ప్రపంచంలోని మెజారిటీ ప్రజలు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రజల జీవనంలో సోషల్ మీడియా భాగమైంది. అందులో ఫేస్‌బుక్ ప్రధానమైంది. కాగా, ఫేస్‌బుక్ పేరు మార్పు సోషల్ మీడియా విభాగంలోనే కీలక పరిణామంగా నెటిజెన్లు చెప్పుకుంటున్నారు.

Updated Date - 2021-10-29T15:12:34+05:30 IST