Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 29 Mar 2022 00:21:23 IST

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను ప్రేమించిన యువతి మిస్సింగ్.. వారం రోజుల తరువాత ప్రమాదంలో మృత్యువు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

twitter-iconwatsapp-iconfb-icon
ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను ప్రేమించిన యువతి మిస్సింగ్.. వారం రోజుల తరువాత ప్రమాదంలో మృత్యువు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

నెల రోజుల క్రితం యూపీలోని ఫతేపూర్ జిల్లాలో ఓ బాలిక మృతదేహం పోలీసులకు లభ్యమైంది. రోడ్డు ప్రమాదంలో మరణించిందని పోలీసులు భావించారు. వారం రోజుల తర్వాత ఆ యువతి పేరు, వివరాలు తెలిశాయి. కుటుంబ సభ్యలు యువతి మరణం పట్ల అనుమానం వ్యక్త చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పుడు విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.


వివరాల్లోకి వెళితే.. జెహనాబాద్‌లోని గోకుల్‌పూర్ పోలీసులకు గత నెలలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఆ యువతి ట్రాక్టర్ కింద పడిపోయి చనిపోయినట్టు పోలీసులు భావించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. వారం రోజుల తర్వాత ఆ యువతి పేరు, వివరాలు పోలీసులకు తెలిశాయి. తమ కుమార్తెను ఎవరో చంపేశారని యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 


మరణించిన యువతికి ఐదేళ్ల క్రితం అభిమన్యు అనే వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమికులుగా మారారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ యువతితో అభిమన్యు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల ఆ యువతి పెళ్లి గురించి ఒత్తిడి చేయడం ప్రారంభించింది. పెళ్లికి అంగీకరించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. దీంతో అభిమన్యు తన సోదరుడు అమిత్‌తో కలిసి యువతిని ట్రాక్టర్‌‌తో తొక్కించి చంపేశాడు. దీంతో అభిమన్యు, అమిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.