ఫేస్‌బుత్ లాగిన్ ప్రాబ్లిమ్

ABN , First Publish Date - 2020-07-25T05:30:00+05:30 IST

కోడ్‌ రావడం లేదు ఎందుకు? నేను ఫేస్‌బుక్‌ కోసం 2-ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌ వాడుతున్నాను. అయితే ఈ మధ్య లాగిన్‌ అయ్యే సమయంలో దానికి సంబంధించిన కోడ్‌ రావడం లేదు...

ఫేస్‌బుత్ లాగిన్ ప్రాబ్లిమ్

కోడ్‌ రావడం లేదు ఎందుకు? నేను ఫేస్‌బుక్‌ కోసం 2-ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌ వాడుతున్నాను. అయితే ఈ మధ్య లాగిన్‌ అయ్యే సమయంలో దానికి సంబంధించిన కోడ్‌ రావడం లేదు. నా వివరాలు ఫేస్‌బుక్‌ హెల్ప్‌ టీమ్‌కి కూడా పంపించాను. అయినా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు. 

- కరుణాకర్‌ రెడ్డి


ఫేస్‌బుక్‌ 2-ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌ సెట్‌ చేసుకున్నవారు మొబైల్‌కి ఓటీపీ వచ్చే విధంగా సెట్‌ చేసుకున్నప్పుడు చాలామందికి ఇదే సమస్య ఏర్పడుతోంది. లాగిన్‌ అయ్యే సమయంలో ఫోన్‌కి ఓటీపీ రావడం లేదు. ఎంత సేపు వేచి చూసినా, ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా ఫలితం ఉండటం లేదు. 2-ఫ్యాక్టర్‌ సెట్‌ చేసుకునేటప్పుడు మొబైల్‌కి ఓటీపీ బదులుగా ‘గూగుల్‌ అథంటికేటర్‌’ యాప్‌లో కోడ్‌ జనరేట్‌ చేయబడేలా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. అప్పుడు ఓటీపీతో సంబంధం లేకుండా అవసరమైనప్పుడు ఆ అప్లికేషన్‌ ఓపెన్‌ చేసి కోడ్‌ వాడుకోవచ్చు. అలాగే 2-ఫ్యాక్టర్‌ సెట్‌ చేసినప్పుడు కొన్ని బ్యాకప్‌ కోడ్‌లు ప్రింట్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఫేస్‌బుక్‌ అందిస్తుంది. అశ్రద్ధ చేయకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చేసి ఉండకపోతే ఇప్పటికిప్పుడు ఎలాంటి పరిష్కారం లేదు. ఫేస్‌బుక్‌ నుంచి స్పందన వచ్చేంత వరకు ఓపికగా వేచి చూడాల్సిందే.


మీ టెక్‌ సందేహాలకు సమాధానాల కోసం navya@andhrajyothy.com

Updated Date - 2020-07-25T05:30:00+05:30 IST