Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 13 Mar 2021 18:38:44 IST

నగ్న వీడియోలు రికార్డు చేసి యువకుడిని బ్లాక్ మెయిల్ చేసిన యువతి

twitter-iconwatsapp-iconfb-icon
నగ్న వీడియోలు రికార్డు చేసి యువకుడిని బ్లాక్ మెయిల్ చేసిన యువతి

హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ ఆ యువకుడి కొంపముంచింది. స్నేహం పేరుతో యువకుడి జేబును ఓ యువతి గుల్ల చేసింది. రూ. 2 లక్షలు పోగొట్టుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు సదరు యువకుడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ యువకుడికి యువతి నుంచి ఫేస్ బుక్‌లో రిక్వెస్ట్ వచ్చింది. ఆ పరిచయం కాస్త చనువు పెంచింది. చివరికి సదరు యువకుడి నగ్న వీడియోలు రికార్డ్‌ చేసే వరకు వెళ్లింది. అప్పుడు అసలు రంగును బయటపెట్టింది యువతి. వీడియోలను అప్ లోడ్ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టింది. దీంతో రెండు లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. యువతి బెదిరింపులు ఎక్కువ అవ్వడంతో చివరికి సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

అవి ఇవిLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.