విద్వేషాలను రెచ్చగొడుతున్న ఖాతాలను తొలగించిన ఫేస్‌బుక్‌

ABN , First Publish Date - 2020-06-07T08:33:30+05:30 IST

విద్వేషాలను ప్రేరేపించే శ్వేత జాతీయుల గ్రూపులకు అనుసంధానించి ఉన్న దాదాపు 200 ఖాతాలను తొలగించినట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. రెచ్చగొట్టే ప్రసంగాలు పోస్ట్‌ చేస్తూ

విద్వేషాలను రెచ్చగొడుతున్న ఖాతాలను తొలగించిన ఫేస్‌బుక్‌

శాన్‌ఫ్రాన్సిస్కో, జూన్‌ 6: విద్వేషాలను ప్రేరేపించే శ్వేత జాతీయుల గ్రూపులకు అనుసంధానించి ఉన్న దాదాపు 200 ఖాతాలను తొలగించినట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. రెచ్చగొట్టే ప్రసంగాలు పోస్ట్‌ చేస్తూ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు ఇప్పటికే నిషేధించిన ప్రౌడ్‌ బాయ్స్‌, అమెరికన్‌ గార్డ్‌ గ్రూపులతో ఆ ఖాతాలు అనుసంధానమై ఉన్నాయని పేర్కొంది. అమెరికా ఆందోళనల్లో మద్దతుదారులు, గ్రూపు సభ్యులు పాల్గొనేలా చేయడం తాము వీడియోల్లో చూశామని.. కొన్నిటిలో ఆయుధాలతో పాల్గొనే విధంగా కూడా ప్రేరేపిస్తున్నట్లుగా ఉందని ఫేస్‌బుక్‌ డైరెక్టర్‌ బ్రియాన్‌ ఫిష్‌మ్యాన్‌ చెప్పారు.

Updated Date - 2020-06-07T08:33:30+05:30 IST