గూగుల్, ఫేస్‌బుక్‌‌ల భారీ ప్రాజెక్టు..సముద్ర గర్భంలో 12 వేల కిలోమీటర్ల..

ABN , First Publish Date - 2021-08-17T01:34:07+05:30 IST

ఆరు తూర్పు ఆసియా దేశాలను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసేందుకు గూగుల్ ఓ భారీ ప్రాజెక్టుకు సంకల్పించింది.

గూగుల్, ఫేస్‌బుక్‌‌ల భారీ ప్రాజెక్టు..సముద్ర గర్భంలో 12 వేల కిలోమీటర్ల..

న్యూఢిల్లీ: ఆరు తూర్పు ఆసియా దేశాలను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసేందుకు గూగుల్ ఓ భారీ ప్రాజెక్టుకు సంకల్పించింది. ఆప్రికాట్ పేరిట ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో భాగంగా సముద్ర గర్భంలో 12 వేల కిలోమీటర్ల మేర ఇంటర్నెట్ కేబుల్‌ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. జపాన్, తైవాన్, గ్వామ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, సింగపూర్ దేశాలను ఈ ప్రాజెక్టు ద్వారా అనుసంధానించనున్నారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కూడా ‘అప్రికాట్’ కోసం పాక్షికంగా నిధులు సమకూర్చనుంది. స్థానిక టెలికాం ఆపరేటర్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు. 2024 కల్లా ఇది పూర్తవుతుందని సమాచారం.

Updated Date - 2021-08-17T01:34:07+05:30 IST