ఫేస్‌యోగాతో ముడతలు మాయం

ABN , First Publish Date - 2020-07-08T05:30:00+05:30 IST

ఒత్తిడి మూలంగా ముఖం మీది ముడతలు, గీతలు ఏర్పడతాయి. దాంతో ముఖం నిర్జీవంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంటి వద్దనే ఫేస్‌యోగాతో ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చంటున్నారు యోగా టీచర్‌ జెనిల్‌ ధోలాకియా...

ఫేస్‌యోగాతో ముడతలు మాయం

ఒత్తిడి మూలంగా ముఖం మీది ముడతలు, గీతలు ఏర్పడతాయి. దాంతో ముఖం నిర్జీవంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంటి వద్దనే ఫేస్‌యోగాతో ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చంటున్నారు యోగా టీచర్‌ జెనిల్‌ ధోలాకియా. ఫేస్‌యోగా ఎలా చేయాలో చెబుతున్నారిలా...


  1. అరచేతులతో మెడ భాగాన్ని మర్దన చేయాలి. దాంతో మెడ దగ్గరి చర్మం టోన్‌ అవుతుంది.
  2. నోటి నిండా గాలి అదిమిపట్టాలి. ఇప్పుడు ఆ గాలిని కుడి, ఎడమ చెక్కిళ్ల వైపు జరుపుతూ కొద్దిసేపు చేయాలి.
  3. రెండు అరచేతులను చెక్కిళ్ల దగ్గరి ఎముకలపైన పెట్టి పైకి, కిందకు మసాజ్‌ చేయాలి. దాంతో ముఖ కండరాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. 
  4. చేతివేళ్లను నుదురు మీద పెట్టి కుడి, ఎడమకు నెమ్మదిగా మసాజ్‌ చేస్తున్నట్టు కదిలించాలి. దాంతో ముఖం మీది గీతలు తగ్గిపోతాయి.

Updated Date - 2020-07-08T05:30:00+05:30 IST