ముఖం మెరవాలంటే...

ABN , First Publish Date - 2020-08-05T22:01:25+05:30 IST

కూరగాయలతో సైతం ముఖ చర్మాన్ని మెరుపులు చిందించవచ్చు. అందులోనూ టొమాటో మాస్కుతో ముఖం బాగా నునుపు తేలి ‘వావ్‌’ అనిపిస్తుంది. టొమాటోలో

ముఖం మెరవాలంటే...

ఆంధ్రజ్యోతి(05-08-2020)

కూరగాయలతో సైతం ముఖ చర్మాన్ని మెరుపులు చిందించవచ్చు. అందులోనూ టొమాటో మాస్కుతో ముఖం బాగా నునుపు తేలి ‘వావ్‌’ అనిపిస్తుంది. టొమాటోలో విటమిన్‌-ఎ, సిలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. దీనివల్ల ముఖంపై మొటిమలు రావు. ముఖానికి టొమాటో స్క్రబ్బింగ్‌, క్లీనింగ్‌, ఫేస్‌ప్యాక్‌ ఎలా చేసుకోవాలంటే...

క్లీనింగ్‌

కావలసినవి: శనగపిండి, శాండిల్‌ పౌడర్‌, టొమాటో ప్యూరీ, పెరుగు, చిటికెడు పసుపు. 


తయారీ: టొమాటో ప్యూరీ-ఒక టీస్పూన్‌, పెరుగు-ఒక టీస్పూన్‌, నిమ్మరసం-ఒక స్పూన్‌, పసుపు-కొద్దిగా తీసుకుని, పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. తర్వాత నేరుగా నీళ్లతో కడగకుండా ముఖంపై కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుని కాటన్‌తో తుడుచుకుంటే శుభ్రంగా ఉంటుంది. 


స్క్రబ్బింగ్‌ 

కావలసినవి: బియ్యప్పిండి, టొమాటోప్యూరీ, పచ్చిపాలు, చిటికెడు పసుపు. 


తయారీ: ఒక స్పూను బియ్యప్పిండి, ఒక స్పూను టొమాటోప్యూరీ, ఒక స్పూను పచ్చిపాలు, చిటికెడు పసుపు ఒక కప్పులో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద తేలికపాటి మసాజ్‌ చేస్తూ ఐదు నుంచి పదినిమిషాలు రాయాలి. తర్వాత వాటర్‌ స్ర్పేతో దూదిని ఉపయోగించి క్లీన్‌ చేయాలి.


ఫేస్‌ప్యాక్‌ 

కావలసినవి: టొమాటో ప్యూరీ, పెరుగు, గంధం పొడి


తయారీ: టొమాటో ప్యూరీ రెండు స్పూన్లు, ఒక టీ స్పూను పెరుగు(జిడ్డు చర్మం ఉన్నవాళ్లు పాలను వాడాలి), కొద్దిగా గంధంపొడిని ఒక కప్పులో వేసి పేస్టులా చేయాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకుని, 20 నిమిషాలపాటు ఉంచుకోవాలి. డ్రై అయిన తర్వాత ముఖంపై నీళ్లు చల్లి దూదితో శుభ్రంగా  తుడుచుకోవాలి. పదిహేను రోజులకు ఒకసారి ఇలా చేయడం వల్ల చర్మానికి మెరుపు రావడమేగాక చర్మం బిగుతుగా ఉంటుంది.


Updated Date - 2020-08-05T22:01:25+05:30 IST