Omicron కట్టడికి కరోనా కంటైన్మెంట్ జోన్లలో నైట్ కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-12-22T13:07:32+05:30 IST

దేశంలో పెరుగుతున్న ఒమైక్రాన్ కేసుల కట్టడికి కరోనా కంటైన్మెంటు జోన్లలో నైట్ కర్ఫ్యూ విధించాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది...

Omicron కట్టడికి కరోనా కంటైన్మెంట్ జోన్లలో నైట్ కర్ఫ్యూ

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న ఒమైక్రాన్ కేసుల కట్టడికి కరోనా కంటైన్మెంటు జోన్లలో నైట్ కర్ఫ్యూ విధించాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేర కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల మధ్య రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు ఒమైక్రాన్‌ను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. జన సమూహాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, వివాహాలు, అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్యను తగ్గించాలని కేంద్రం కోరింది. ఫేస్ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. కరోనా పరీక్షలు, నిఘా పెంచడంతోపాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని కేంద్రం సూచించింది.


ఒమైక్రాన్ కేసులు వెలుగుచూసిన ప్రాంతాల్లో కంటైన్మెంటు జోన్లుగా ప్రకటించి వైరస్ వ్యాప్తిచెందకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు కోరారు.కొవిడ్ పాజిటివ్ కేసుల క్లస్టర్లు, కంటైన్మెంటు జోన్లు, బఫర్ జోన్లు ఏర్పాటు చేయాలని కోరింది. డెల్టా కంటే ఒమైక్రాన్ వేరియెంట్ మూడు రెట్లు పెరుగుతున్నందున జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల కోసం కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది.కొవిడ్ వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. 

Updated Date - 2021-12-22T13:07:32+05:30 IST