జూలై 24 నుంచి ఫేస్‌మాస్క్ తప్పనిసరి: యూకే

ABN , First Publish Date - 2020-07-15T03:26:54+05:30 IST

ఫేస్‌మాస్క్ ధరించడం వల్ల కరోనా బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు

జూలై 24 నుంచి ఫేస్‌మాస్క్ తప్పనిసరి: యూకే

లండన్: ఫేస్‌మాస్క్ ధరించడం వల్ల కరోనా బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో అనేక దేశాలు ఫేస్‌మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తున్నాయి. యూకే ప్రభుత్వం కూడా కరోనాను నియంత్రించేందుకు ఫేస్‌మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలని నిర్ణయించుకుంది. జూలై 24 నుంచి ప్రజలు దుకాణాలకు వెళ్లాలంటే ఫేస్‌మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని యూకే ప్రభుత్వం వెల్లడించింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించే సమయంలో ఫేస్‌మాస్క్ తప్పనిసరి అని జూన్ 15న ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆ నిబంధనలను ప్రభుత్వం మరింత పెంచింది. ఇక యూకేలో ప్రభుత్వ నిబంధనలను పాటించకపోతే 100 పౌండ్ల(రూ. 9,450) వరకు జరిమానా విధించే అవకాశముంటుంది. ఇప్పటికే పోలీసులకు ఫైన్ విధించే అధికారాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చింది. కాగా.. యూకేలో ఇప్పటివరకు 2.9 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా దాదాపు 45 వేల మంది మరణించారు.

Updated Date - 2020-07-15T03:26:54+05:30 IST