ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ చేసి అసభ్యకర పోస్టులు

ABN , First Publish Date - 2021-11-07T16:00:40+05:30 IST

పార్టీ పదవి తనకు ఇవ్వకుండా మరో మహిళకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక తిరుచ్చి కార్పొరేషన్‌ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఫేస్‌బుక్‌ ఖాతాను హ్యాక్‌ చేసి అసభ్యకర పోస్టులు పెట్టింనందుకు బీజేపీ మ

ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ చేసి అసభ్యకర పోస్టులు

అడయార్‌(Chennai): పార్టీ పదవి తనకు ఇవ్వకుండా మరో మహిళకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక తిరుచ్చి కార్పొరేషన్‌ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఫేస్‌బుక్‌ ఖాతాను హ్యాక్‌ చేసి అసభ్యకర పోస్టులు పెట్టింనందుకు బీజేపీ మహిళా నేతను తిరుచ్చి సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, తిరుచ్చి తిల్లై నగర్‌కు చెందిన కాళీశ్వరన్‌ అనే వ్యక్తి తిరుచ్చి కార్పొరేషన్‌ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన ఫేస్‌బుక్‌ ఖాతాను బీజేపీకి  చెందిన తిరుచ్చి కరుమండపం విశ్వాస్‌నగర్‌కు చెందిన తిలకా శివమూర్తి (50) హ్యాక్‌ చేసి, వివిధ రకాలైన పోస్టులు పెట్టసాగింది. ఈ నేపథ్యంలో తనకు రావాల్సిన పార్టీ పదవిని మరో మహిళకు ఇవ్వబోతున్నాడని తెలుసుకున్న తిలక.. కాళీశ్వరన్‌, కేశన్‌, తాళక్కుడి విజయ్‌ల తీరుపై మండిపడింది. పైగా వీరిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా, ఈ ముగ్గురు అమ్మాయిలతో వున్నట్టుగా ఫొటోలు మార్ఫింగ్‌ చేసి కాళీశ్వరన్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలోనే అప్‌లోడ్‌ చేసింది. ఈ ఫొటోలు చూసి షాక్‌కు గురైన కాళీశ్వరన్‌ జిల్లా సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆరా తీయగా తిలకా శివమూర్తిగా గుర్తించి అరెస్టు చేశారు. ఈమెకు సహకరించిన తూత్తుక్కుడికి చెందిన రవిముత్తుకుమరన్‌ను కూడా అరెస్టు చేశారు. వీరిద్దని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

Updated Date - 2021-11-07T16:00:40+05:30 IST