ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ను ఇలా సరిదిద్దవచ్చు!

ABN , First Publish Date - 2022-07-05T18:38:57+05:30 IST

తలకట్టు, ముఖ కవళికలు, స్వరం మొదలైన లక్షణాలు ఒకర్ని గుర్తుపట్టడానికి సహాయపడతాయి. కానీ ‘ప్రోసోపాగ్నోసియా’ అనే

ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ను ఇలా సరిదిద్దవచ్చు!

తలకట్టు, ముఖ కవళికలు, స్వరం మొదలైన లక్షణాలు ఒకర్ని గుర్తుపట్టడానికి సహాయపడతాయి. కానీ ‘ప్రోసోపాగ్నోసియా’ అనే సమస్య ఉన్నవాళ్లకు పరిచయస్తులను గుర్తుపట్టడం కష్టమవుతుంది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు బ్రాడ్‌ పిట్‌తో తాజాగా వెలుగులోకొచ్చిన ఈ సమస్య నిజానికి కొత్తదేమీ కాదు. 19వ శతాబ్దంలోనే వెలుగుచూసిన ఈ ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ సమస్యకు జర్మన్‌ న్యూరాలజిస్ట్‌, జోఖిమ్‌ బోడమెర్‌, ‘ప్రోసెపాగ్నోసియా’ అని పేరు పెట్టాడు. ఈ సమస్య ఉన్నవాళ్లు సన్నిహిత కుటుంబ సభ్యులను, స్నేహితులను గుర్తుపట్టడంలో కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. స్ట్రోక్‌ లేదా రక్తస్రావంలో అడ్డంకి, రక్తపు గడ్డ (హెమరేజ్‌), ట్యూమర్‌ తలెత్తడం మూలంగా మెదడు కుడి వైపున ఉండే టెంపరో ఆక్సిపిటల్‌ ఏరియా దెబ్బతిన్నప్పుడు ఈ సమస్య మొదలవుతుందని వైద్యులు అంటున్నారు. అయితే అల్జీమర్స్‌, పార్కిన్‌సన్‌ వ్యాధుల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. ఈ సమస్య తీవ్రమైనప్పుడు, మూల కారణాన్ని సరిదిద్దే చికిత్సను వైద్యులు అనుసరిస్తారు. స్ట్రోక్‌ మూలంగా సమస్య తలెత్తితే, ఆ సమస్యను సరిచేయడం, ట్యూమర్‌ కారణమైతే, కీమోథెరపీ, రేడియేషన్‌తో దాన్ని కరిగించడం, హెమరేజ్‌కు అందుకు తగిన చికిత్సతో కరిగించడం ద్వారా ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ను సరిదిద్దవచ్చని వైద్యులు అంటున్నారు.

Updated Date - 2022-07-05T18:38:57+05:30 IST