Sep 17 2021 @ 18:01PM

F3: అంతకు మించి నవ్వులు

విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న ‘ఎఫ్‌3’ సినిమా షూటింగ్‌ శుక్రవారం హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న ఆర్టిస్ట్‌లంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేయడానికి చిత్ర బృందం శ్రమిస్తోంది. ‘ఎఫ్‌2’ ఎంతగా నవ్వులు పూయించిందో... అంతకుమించి ఈ చిత్రం హాస్యాన్ని పంచబోతోందని చిత్ర చూనిట్‌ చెబుతోంది. ‘ఎఫ్‌ 3’ కోసం వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్‌ను క్రియేట్‌ చేశారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. గత పాటలను మించేలా దేవిశ్రీప్రసాద్‌ ట్యూన్లు అందిస్తున్నారు.  తాజాగా విడుదల చేసిన మేకింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో సునీల్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీశ్‌ నిర్మిస్తున్నారు.