Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 03 Jul 2022 13:48:03 IST

F3 : ఓటీటీలోకి వచ్చేస్తోంది.. !

twitter-iconwatsapp-iconfb-icon

విక్టరీ వెంకటేశ్ (Venkatseh), మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా.. అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన ఫన్ రైడ్ మూవీ ‘ఎఫ్ 3’ (F3). సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ (F2) చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలోని పాత్రలనే కంటిన్యూ చేస్తూ.. మరో కథతో సీక్వెల్ తెరకెక్కింది. మొదటి భాగం స్థాయిలోనే రెండో భాగమూ సూపర్ సక్సెస్ సాధించింది. దిల్ రాజు (Dilraju) నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా మే 27న సమ్మర్ కానుకగా విడుదలైంది. సమ్మర్ సోగ్గాళ్ళు ట్యాగ్ లైన్ తో వెంకీ, వరుణ్‌లు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించడంలో బాగా సక్సెస్ అయ్యారు.  

వెంకీ రేచీకటి, వరుణ్ నత్తి ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. అలాగే కథానాయికలుగా తమన్నా (Tamanna), మెహ్రీన్‌ల (Mehreen)లతో పాటు సోనాల్ చౌహాన్ (Sonal Chouhan) గ్లామర్ సినిమా విజయానికి బాగా ప్లస్ అయ్యాయి. విడుదలకు ముందు టీజర్, సింగిల్స్, ట్రైలర్స్‌తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర బృందం. అంచనాల్ని అధిగమిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది చిత్రం. 

ఈ సినిమా విడుదలై.. ఇప్పటికి 36 రోజులయింది. కానీ ఇంతవరకు ఓటీటీలోకి  రానేలేదు. అయితే చిత్రం ఇంకా థియేటర్స్ లో బాగానే ఆడుతుండడంతో ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా వస్తోంది. నిజానికి ఈ సినిమాను థియేటర్స్ లోకి వచ్చిన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ముందుగా తెలిపారు.  అంతకన్నా ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ సినిమాను ఈ నెల 22న సోనీ లివ్ (Sony Liv) లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. దీనికి గాను సోనీ లివ్ వారు రూ. 13 కోట్లు డీల్ సెట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇది సాలిడ్ డీల్ అనే చెప్పాలి.  థియేటర్స్ లోనే ప్రేక్షకుల్ని పగలబడినవ్వించిన ‘ఎఫ్ 3’ చిత్రం ఓటీటీలో ఇంకెంతగా ఆదరణను దక్కించుకుంటుందో చూడాలి.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement