F-1 Student Visa: అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన !

ABN , First Publish Date - 2022-05-12T12:51:34+05:30 IST

ఎఫ్‌-1 విద్యార్థి వీసా తిరస్కరణకు గురైన వారికి రానున్న దరఖాస్తుల్లో మరోసారి స్లాట్‌ ఇవ్వడం కుదరదని అమెరికా రాయబార కార్యాలయ మినిస్టర్‌ కౌన్సిలర్‌ డొనాల్డ్‌ ఎల్‌ హెఫ్లెన్‌ బుధవారం స్పష్టం చేశారు. ఢిల్లీలోని రాయబార కార్యాలయ వెబ్‌పేజీలో నిర్వహించిన 45 నిముషాల లైవ్‌ చాట్‌లో ఆయన ఈ మేరకు వెల్లడించారు.

F-1 Student Visa: అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన !

ఎఫ్‌-1 వీసా దరఖాస్తు ఈసారి కొత్తవారికి మాత్రమే

న్యూఢిల్లీ, మే 11: ఎఫ్‌-1 విద్యార్థి వీసా తిరస్కరణకు గురైన వారికి రానున్న దరఖాస్తుల్లో మరోసారి స్లాట్‌ ఇవ్వడం కుదరదని అమెరికా రాయబార కార్యాలయ మినిస్టర్‌ కౌన్సిలర్‌ డొనాల్డ్‌ ఎల్‌ హెఫ్లెన్‌ బుధవారం స్పష్టం చేశారు. ఢిల్లీలోని రాయబార కార్యాలయ వెబ్‌పేజీలో నిర్వహించిన 45 నిముషాల లైవ్‌ చాట్‌లో ఆయన ఈ మేరకు వెల్లడించారు. ‘‘విద్యార్థి వీసాలకు ఈ ఏడాది జూన్‌తో పాటు జూలై ప్రథమార్ధంలో దరఖాస్తుల్ని స్వీకరిస్తాం. అయితే.. కేవలం తొలిసారి దరఖాస్తు చేస్తున్న వారికి మాత్రమే ఈసారి స్లాట్‌ కేటాయించాలని భావిస్తున్నాం’’ అని హెఫ్లిన్‌ పేర్కొన్నారు. 

Read more