Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 20 May 2022 12:52:26 IST

F 3: సెన్సార్ పూర్తి..రన్ టైమ్ ఎంతంటే..

twitter-iconwatsapp-iconfb-icon
F 3: సెన్సార్ పూర్తి..రన్ టైమ్ ఎంతంటే..

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎఫ్ 2 (F 2) చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 (F 3) రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయాయి. విక్టరీ వెంకటేష్ (Venkatesh)- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా, తమన్నా భాటియా (Tamannaah Bhatia) - మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) వారికి జంటగా నటించిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) స్పెషల్ సాంగ్‌లో అలరించబోతోంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ మూవీని 27 మే 2022న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే, ఈ మూవీ నుంచి వచ్చిన థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్‌కు ప్రేక్షకులనుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై కూడా భారీగానే అంచనాలు పెరిగాయి. ఇక ఈ మూవీకి తాజాగా సెన్సార్ పూర్తైంది. 2 గంటల 28 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమాకి క్లీన్ యూ (U) సర్టిఫికేట్ వచ్చిందని మేకర్స్ తెలిపారు. 

అంతేకాదు, సెన్సార్ బోర్డ్ సభ్యులు ఎఫ్ 3 సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. చాలాకాలం తర్వాత క్లీన్ అండ్ హెల్తీ ఎంటర్టైనర్‌ను వీక్షించినట్లు చెప్పారట. మొత్తానికి సెన్సార్ వారు కూడా పాజిటివ్‌గా చెప్పడంతో హిట్ అని ఫ్యాన్స్ ఫిక్సైపోయారు. కాగా, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు - శిరీష్ నిర్మించారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International