సర్వేంద్రియానాం నయనం ప్రధానం

ABN , First Publish Date - 2022-05-23T06:48:06+05:30 IST

కంటి సం రక్షణలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ప్ర ముఖ నేత్ర వైద్య నిపుణులు, అమెరి కా ఐ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, వ్యవస్థా పకుడు, గౌతమి ఐ ఇనిస్టిట్యూట్‌ ప్రెసి డెంట్‌ డాక్టర్‌ వీకే రాజు అన్నారు.

సర్వేంద్రియానాం నయనం ప్రధానం

రాజానగరం, మే 22: కంటి సం రక్షణలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ప్ర ముఖ నేత్ర వైద్య నిపుణులు, అమెరి కా ఐ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, వ్యవస్థా పకుడు, గౌతమి ఐ ఇనిస్టిట్యూట్‌ ప్రెసి డెంట్‌ డాక్టర్‌ వీకే రాజు అన్నారు. జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాలలో గౌత మి నేత్రాలయం ఆధ్వర్యంలో ఆదివా రం పీడియాట్రిక్‌ ఆప్తాల్మాలజీ కాన్ఫ రెన్స్‌ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేత్ర వైద్య నిపుణులు మాట్లాడుతూ అన్ని అవ యవాల కంటే కన్ను ప్రధానమైందని, కంటి సంరక్షణలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే దీర్ఘకాలిక ప్రభావాలకు గురికావాల్సి వస్తుందన్నారు. గౌతమి నేత్రాలయం ఎండీ వివి కుమార్‌ పిల్లలో కంటి సంరక్షణ నిర్వహణలో ప్రధాన సమస్యలు, పరిష్కారాలను వివరించారు. అలాగే డాక్టర్లు రాజవర్ధన్‌ అజాద్‌, ఏకే గ్రోవర్‌, పి.రంజిత్‌కుమార్‌, వై.శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌.శ్రీనివాసరావు పిల్లల్లో విజన్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రిప్రాక్షన్‌, ఆర్‌వోపీ రహస్యాలు, సెమాం టిక్స్‌, ఆర్‌వోపీ స్ర్కీనింగ్‌లో టెలిమెడిసిన్‌ పాత్ర, సూక్ష్మ నైపుణ్యాలను ప్రస్తావి స్తూ, పీడియాట్రిక్‌ రెటినాల్‌ సర్జరీ, క్యాటరాక్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విషయాలపై ప్రసంగించారు. అలాగే యూఎస్‌ఏ నుంచి డాక్టర్‌ లీలా వి రాజు, డాక్టర్‌ లేఖా ఎస్‌.హోతా జూమ్‌ మీటింగ్‌ ద్వారా కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ నేత్ర వైద్యంలో ఆధునాతన మార్పులు, కంటి సంరక్షణకు జాగ్రత్తలను తెలియ జేశారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో గౌతమి ఐ ఇనిస్టిట్యూట్‌, ఐ ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా సంయుక్తంగా నిర్వహిం చిన ఈ సదస్సులో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏపీలో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 110 నేత్ర వైద్యులతో పాటు ఆప్తాల్మాలజీ పీజీ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T06:48:06+05:30 IST