వేసవిలో కంటిచూపును కాపాడుకోవడం ఎలా?

ABN , First Publish Date - 2022-03-23T18:51:15+05:30 IST

ఎండలు తీవ్రమవుతున్నాయి. వచ్చేదంతా వడగాల్పుల కాలమేనని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటువంటి పరిస్థితులలో అతినీలలోహిత కిరణాల

వేసవిలో కంటిచూపును కాపాడుకోవడం ఎలా?

ఆంధ్రజ్యోతి(23-03-2022)

‘సన్‌’కు గ్లాస్‌ తొడిగేద్దాం!

చలువ అద్దాలతో చల్లని చూపు 

హానికారక యువీ కిరణాల నుంచి సైతం రక్షణ


హైదరాబాద్‌ సిటీ : ఎండలు తీవ్రమవుతున్నాయి. వచ్చేదంతా వడగాల్పుల కాలమేనని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటువంటి పరిస్థితులలో అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా కళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సన్‌గ్లాసె్‌సతో కళ్లను సంరక్షించుకోవచ్చు. కళ్లతోపాటుగా కంటి చుట్టూ సున్నితమైన పొరను కాపాడుకోవడానికి యువీ కోటింగ్‌ కలిగిన సన్‌గ్లాసెస్‌ వాడటం ఉత్తమం. ఈ వేసవిలో యూవీ ప్రొటెక్టెడ్‌ సన్‌గ్లాసె్‌సతో కళ్ల రక్షణతో పాటుగా తలనొప్పి, కళ్లు మసకబారడం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. యువీ రేడియేషన్‌ కారణంగా ఫొటోకెరాటిటిస్‌ అనే సమస్య వస్తుందని, సుదీర్ఘకాలం యూవీ రేడియేషన్‌ ప్రభావానికి గురైతే మాక్యులర్‌ డీజనరేషన్‌, క్యాటరాక్ట్‌ వంటి సమస్యలూ ఉత్పన్నం కావొచ్చని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో యువీ నుంచి రక్షణ నుంచి రక్షణకు సన్‌గ్లాసెస్‌ ఎందుకు వాడాలంటే...


యూవీకీ చెక్‌.. కళ్లకు సేఫ్‌

కళ్లద్దాలను కొనుగోలు చేసే ముందు అవి ముఖాకృతికి ఎంతవరకూ నప్పుతాయనేది చూసుకోవడం ఎంత ముఖ్యమో, యూవీ కిరణాల నుంచి రక్షణ ఏ మేరకు అందిస్తాయో చూడటమూ అంతే ముఖ్యం. యూవీ ఏ, బీ కిరణాల నుంచి పూర్తి రక్షణ కల్పించే సన్‌గ్లాసెస్‌ ఎంచుకోవాలి.


తలనొప్పి నుంచి ఉపశమనం..

చాలామంది ఎండ నుంచి రక్షణ కోసమంటూ ఏదో ఒక సన్‌గ్లాసెస్‌ పెడుతుంటారు. వీటి వల్ల లాభాలకంటే నష్టాలే ఎక్కువ. కాంతిని అడ్డుకునేందుకు వాడే కొన్ని రకాల లెన్స్‌ల వల్ల తలనొప్పి, కళ్ల నొప్పులు వచ్చే అవకాశాలున్నాయని అధ్యయనాలలో తేలింది. నాణ్యత లేని కళ్లద్దాల వల్ల కంటి చూపు కూడా మందగించే అవకాశాల్నుయి. కాబట్టి నాణ్యతకు అధిక ప్రాధాన్యమివ్వాలి.


కారు అయినా, బైక్‌ అయినా..

ఎండలో కారులో ప్రయాణించినంత మాత్రాన, లేదంటే హెల్మెట్‌ రక్షణలో బైక్‌ నడుపుతున్నా కొంతవరకూ రక్షణ ఉంటుంది కానీ, నేరుగా కళ్లలో సూర్యకాంతి పడుతున్నప్పుడు మాత్రం వాహనాలు నడపటం ఇబ్బందే! ఈ ఇబ్బందికి సన్‌గ్లాసెస్‌తో చెక్‌పెట్టవచ్చు.


వ్యాధుల నుంచి రక్షణకూ

సన్‌గ్లాసె్‌సతో పలు రకాల కళ్ల ఇన్‌ఫెక్షన్స్‌ నుంచి మరీ ముఖ్యంగా కళ్లకలక లాంటి వాటి నుంచి కొంత రక్షణ పొందవచ్చు.


ఇలా చేయండి..

సాధారణంగా సన్‌గ్లాసెస్‌ 100% యూవీ ప్రొటెక్షన్‌, టింటింగ్‌, పోలరైజేషన్‌, వ్రాప్‌ఎరౌండ్‌ శైలిగా లభిస్తుంటాయి.

మీ జుట్టు రంగు, మీ రంగు కూడా సన్‌గ్లాసెస్‌ ఎంపికలో ప్రభావం చూపుతుంది. ప్రయోగాలు చేయడం ద్వారా ఫ్యాషన్‌గా ఉండవచ్చు.

క్లాసిక్‌ ఫ్రేమ్‌ షేప్స్‌ అయిన ఏవియేటర్స్‌, క్లబ్‌మాస్టర్స్‌, వేఫారర్స్‌ లాంటివి ఫ్యాషన్‌ పరంగా  ధరించవచ్చు.

Updated Date - 2022-03-23T18:51:15+05:30 IST