ప్రభుత్వ భూమిపై ప్రజాప్రతినిధుల కన్ను

ABN , First Publish Date - 2022-07-01T06:38:15+05:30 IST

మండలంలోని ఖానాపురం గ్రామంలో రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిపై ప్రజాప్రతినిధులు కన్నేశారు. రూ.45 లక్షల విలువైన ఈ భూమిని విక్రయించడానికి పావులు కదుప ుతున్నారు.

ప్రభుత్వ భూమిపై ప్రజాప్రతినిధుల కన్ను
ఖానాపురం గ్రామంలోని ప్రభుత్వ భూమి

ఖానాపురంలో రెండున్నర ఎకరాలు విక్రయానికి రంగం సిద్ధం

అనంతగిరి, జూన్‌ 30: మండలంలోని ఖానాపురం గ్రామంలో రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిపై ప్రజాప్రతినిధులు కన్నేశారు.   రూ.45 లక్షల విలువైన ఈ భూమిని విక్రయించడానికి పావులు కదుప  ుతున్నారు. ఖానాపురం గ్రామంలోని సర్వే నెం.50లో మొత్తం ప్రభుత్వ భూమి 71 ఎకరాల 35 కుంటలు ఉంది. దానిలో 68ఎకరాల 15 కుంటల భూమిలో ప్రభుత్వం గతంలో పట్టాలు ఇచ్చింది. మరో ఎకరం పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌యార్డు సెగ్రిగేషన్‌ షెడ్డుకు కేటాయించగా మరో రెండు ఎకరాల 20 కుంటల భూమి ఉంది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిఽధులు ఆ భూమిని ఎకరా రూ.18లక్షల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

భూమికి సరిహద్దులు ఏర్పాటు చేస్తాం

ప్రభుత్వ భూమిని సర్వే చేయించి సరిహద్దులు ఏర్పాటు చేయిస్తా. ఈ భూమిని ప్రజాప్రతినిధులు విక్రయానికి యత్నిస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. నిబంధనను అతిక్రమించి ప్రభుత్వ భూమిని విక్రయించిన వారిపై, కొనుగోలుదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూమిని కొను గోలు చేస్తే  నష్టపోతారు.  ఈ భూమిని కాపాడుతాం. 

 సంతోష్‌కిరణ్‌, తహసీల్దార్‌, అనంతగిరి 




Updated Date - 2022-07-01T06:38:15+05:30 IST