‘ఐ డ్రైవ్‌ రెస్పాన్స్‌బిలిటీ’

ABN , First Publish Date - 2021-01-27T05:55:26+05:30 IST

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు, రిపబ్లిక్‌ డే సందర్భంగా స్థానిక రవాణాశాఖ, సన్‌ రైజర్స్‌ రైడింగ్‌ క్లబ్‌ సంయుక్తంగా మంగళవారం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాయి.

‘ఐ డ్రైవ్‌ రెస్పాన్స్‌బిలిటీ’
ర్యాలీని ప్రారంభిస్తున్న ఎంవీఐ శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 26: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు, రిపబ్లిక్‌ డే సందర్భంగా స్థానిక రవాణాశాఖ, సన్‌ రైజర్స్‌ రైడింగ్‌ క్లబ్‌ సంయుక్తంగా మంగళవారం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఐ డ్రైవ్‌ రెస్పాన్స్‌బిలిటీ పేరుతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మో టార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ పుష్కరఘాట్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌ టీవోటీ విధానంలో రవాణాశాఖ రోడ్డు భద్రతా నియమాలను ముందుగా క్లబ్‌ టీం సభ్యులకు తెలియజేసి వారి ద్వారా సామాన్య ప్రజలకు వివరిస్తున్నట్టు ఆయన చెప్పారు. హెల్మెట్‌, సీటుబెల్టు ఉపయోగాలు, వాటి వినియోగం వంటి విషయాలను వారు తెలియజేస్తారన్నారు. ఎక్కువ మంది ని ప్రోత్సహించిన సభ్యులకు మాసోత్సవాల చివరిరోజున ప్రశంసాపత్రాలు అంద జేస్తామన్నారు. సన్‌రైజర్స్‌ గ్రూప్‌ ఫౌండర్‌ విక్రమ్‌, క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:55:26+05:30 IST