Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 10 Aug 2022 00:05:29 IST

అందమైన ప్రేమకథ ఏయ్‌పిల్లా

twitter-iconwatsapp-iconfb-icon

హీరో రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్‌ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి ‘ఏయ్‌...పిల్లా’ అనే టైటిల్‌ ఖరారయింది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్నారు. లుధీర్‌ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మిస్‌ ఇండియా ఫస్ట్‌ రన్నరప్‌ రూబల్‌ షెకావత్‌ కథానాయిక. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘హృదయానికి హత్తుకునే అందమైన ప్రేమకథా చిత్రమిది. వింటేజ్‌ ప్రేమకథగా రూపొందిస్తున్నాం. సెప్టెంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు రమేశ్‌ వర్మ కథకు అన్వర్‌ సంభాషణలు అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ:శ్యామ్‌ కె. నాయుడు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement